
సాక్షి,బదౌన్(యూపీ): ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. బదౌన్‌కు సమీప గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోరిక తీర్చేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో మహిళను సొంత బావ సజీవ దహనం చేశాడు. లబరి గ్రామంలో బుధవారం రాత్రి వితంతు మహిళ నీలం ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె బావ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.బాధితురాలు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెను సజీవ దహనం చేశాడని పోలీసులు చెప్పారు.
ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment