అమిత్ షా ర్యాలీలో అపశృతి | Wall collapses at Amit Shah rally venue, 10 injured | Sakshi
Sakshi News home page

అమిత్ షా ర్యాలీలో అపశృతి

Published Thu, Oct 29 2015 6:11 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

అమిత్ షా ర్యాలీలో అపశృతి - Sakshi

అమిత్ షా ర్యాలీలో అపశృతి

బాగా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం బీహార్లోని బాగా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఓ గోడ కూలి దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇస్తూ అమిత్ షా ర్యాలీ కోసం హెలికాప్టర్లో వస్తుండగా దానిని చూసేందుకు భారీ సంఖ్యలో ఓ గోడపైకి ఎక్కారని దీంతో ఆ గోడ కూలి వారు ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు.

వారు ఆ గోడ ఎక్కడానికి ముందే బీటలు వారి బలహీనంగా ఉందని అందుకే పడిపోయిందని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఏదో జరిగిపోతుందన్న భయంతో జనాలు పరుగులు తీయగా తొక్కిసలాట జరిగే పరిస్థితి తలెత్తింది. కానీ పోలీసులు అప్రమత్తమడంతో మరో తొక్కిసలాట ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపట్ల అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement