'ఆ మూడు పార్టీల కలయిక వల్లే ఓడిపోయాం' | bjp parliamentary board meeting concluded | Sakshi
Sakshi News home page

'ఆ మూడు పార్టీల కలయిక వల్లే ఓడిపోయాం'

Published Mon, Nov 9 2015 6:14 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'ఆ మూడు పార్టీల కలయిక వల్లే ఓడిపోయాం' - Sakshi

'ఆ మూడు పార్టీల కలయిక వల్లే ఓడిపోయాం'

న్యూఢిల్లీ: బిహార్లో మహాకూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని, మూడు పార్టీలు (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) మహా కూటమిగా ఏర్పడటంతోతో ఓటమి చెందామని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై.. బిహార్లో ఎన్డీయే ఓటమి, పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశానంతరం అరుణ్ జైట్లీ మీడియాతో ఏం చెప్పారంటే..
 

  • బిహార్లో ఎన్డీయే ఓటమిని అంగీకరిస్తున్నాం.. అక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యలు మా ఓటమికి కారణం కాదు
  • రిజర్వేషన్లపై మా వైఖరి సరిగా ఉంది
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం
  • మహా కూటమిలో మూడు పార్టీలు కలవడం వల్లే మేం ఓడిపోయాం
  • ప్రత్యర్థి పార్టీలు కావాలనే  మాపై దుష్ప్రచారం చేశాయి
  • మహా కూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం
  • బిహార్లో ఓడినా ఇంతకుముందు మూడు రాష్ట్రాల్లో గెలిచాం
  • బిహార్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు రెఫరెండం కాదు
  • బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement