– గోడకూలి 15 మందికి గాయాలు
కర్నూలు(హాస్పిటల్): నగరంలో మంగళవారం జరిగిన నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. వినాయక ఘాట్ పక్కన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పాత కట్టడం కావడంతో కూలిపోయి 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వినాయక ఘాట్ వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కితే నిమజ్జన కార్యక్రమం మరింత బాగా చూడొచ్చు అన్న ఉద్దేశంతో వారు కాంప్లెక్స్ ఎక్కే ప్రయత్నం చేశారు. మెట్ల మార్గం పాతబడిపోయి ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో కర్నూలు నగరంలోని మమతానగర్‌కు చెందిన శంకరమ్మ (50), శరీన్ నగర్‌కు చెందిన అయ్యమ్మ, సునీత, ఆమె భర్త రాజు, లక్ష్మి, మంజుతో పాటు బుధవారపేటకు చెందిన మద్దమ్మ, శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీఉషా, కష్ణనగర్‌కు చెందిన తిరుపాల్, షరీన్‌నగర్‌కు చెందిన శ్రీవాణి, శివతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో పైలెట్ రాంబాబు, టెక్నిషియన్ ఆంజనేయులు తదితరులు ప్రథమ చికిత్స చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శంకరమ్మ, సునీతలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
నిమజ్జనంలో అపశ్రుతి
Published Tue, Sep 13 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement
Advertisement