గోడ కూలి ఇద్దరు మహిళల మృతి
Published Fri, Jul 8 2016 3:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ఇంటి గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో గుడిసె పుల్లమ్మ(55), చిట్టెక్క(30) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఇంటి మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement