మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు | One Student Dead, 23 Injured in Noida Wall Collapse | Sakshi
Sakshi News home page

మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు

Published Fri, Oct 17 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు

మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు

 నోయిడా: ప్రమాదవశాత్తు మట్టిగోడ కూలి పాఠశాలపై పడిన ఘటనలో తొమ్మిదేళ్ల విద్యార్థి మృతి చెందగా, 23 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన యూపీ పరిధిలోని ఢిల్లీ శివారు ప్రాంతమైన నోయిడాలో గురువారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నోయిడా సెక్టార్-49లోని ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన మట్టిగోడ పక్కనే ఉన్న ఆర్‌సీవీ జూనియర్ ఉన్నత పాఠశాలపై కూలిపడింది. ఈ ఘటనలో సందీప్(9)  తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మిగతా 23 మంది విద్యార్థులు ప్రయాగ ఆస్పత్రి, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు మట్టి గోడ యజమాని ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ అతడిని అరెస్టు చేయలేదు. కేసు విచారాణ కోనసాగుతోందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement