
మృతి చెందిన రహీల్
వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటిటౌన్ :గోడ కూలి ఆరు నెలల బాలుడు మృతిచెందాడు. పట్టణంలోని గాంధీబజార్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా.. గాంధీ బజారులోని పాత ఆలయాన్నికూల్చి నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈక్రమంలో పాతగోడలను కూల్చివేస్తుండగా పక్కనే ఉన్న ఇంటిలో నిద్రిస్తున్న ఖాదర్ షరీఫ్ కుమారుడు మహమ్మద్ రహీల్(ఆరు నెలలు) పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖాదర్ షరీఫ్‌కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. కాగా మృతి చెందిన బాలుడు చివరి వాడు.
Comments
Please login to add a commentAdd a comment