లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల ధాటికి గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. లక్నో దిల్‌ఖుషా ప్రాంతంలో శుక్రవారం వేకువ ఝామున ఈ ఘటన జరిగింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సూర్య పాల్.. అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్‌ఖుషా ఏరియాలో గుడిసెల్లో కొందరు కార్మికులు నివసిస్తున్నారు. ఆర్మీ ఎన్‌క్లేవ్ గోడను ఆనుకుని వాళ్లు గుడిసెలు వేసుకున్నారు.
ఈ క్రమంలో.. గత ఇరవై నాలుగు గంటల నుంచి వాన కురుస్తూనే ఉంది. గోడ కూలి ప్రమాదం జరిగింది అని లక్నో పోలీస్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా వెల్లడించారు. తొమ్మిది మృతదేహాలను ఘటన జరిగిన వెంటనే దిబ్బల నుంచి వెలికి తీశామని, మరొకరు సజీవంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. మరో చోట గోడ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
Lucknow city wall collapsed after Heavy #Rain near-Dilkusha in #Lucknow#HeavyRain #UP pic.twitter.com/bVPaz25gUB
— Himanshu dixit 🇮🇳💙 (@HimanshuDixitt) September 16, 2022
Comments
Please login to add a commentAdd a comment