కూకట్‌పల్లిలో కూలిన గోడ: చిన్నారి మృతి
Published Sat, Feb 11 2017 3:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
హైదరాబాద్: ప్రహరి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక ఇంద్రాహిల్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పక్కనే ఉన్న చిన్న ఇంటి ప్రహరిగోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న వరలక్ష్మీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొత్త భవనం నిర్మాణంలో ఉండటం వల్లే ప్రహరిగోడ కూలినట్లు స్థానికులు తెలిపారు.
Advertisement
Advertisement