గోడ కూలి తల్లీ, కుమార్తె మృతి
Published Mon, Feb 15 2016 12:12 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
విజయవాడ: విజయవాడ సమీపంలోని నిడమనూరు గ్రామంలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి తల్లి, కుమార్తె మృతి చెందారు. స్థానికంగా ఉండే రాధ( 40) , ఆమె కుమార్తె శిరీష(14) ఇంటి పని చేసు కుంటుండగా పక్కనున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో రాధ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన శిరీష విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Advertisement
Advertisement