గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం గోడ కూలింది. ఆ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోడ కూలిన ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు పూర్తిగా ధ్వంసమైనాయి.