రోదిస్తున్న మృతుల బంధువులు, సునీత, సాగర్
వరంగల్/రామన్నపేట: పాతకాలం నాటి మట్టి గోడను కదిలిస్తే కూలిపోతుందని యజమానికి, మేస్త్రీకి ఎంత చెప్పినా వినిపిం చుకోలేదు. యజమాని, మేస్త్రీలు కలసి నిర్ల క్ష్యంగా గోడను కదిపి కూలీల జీవితాలను నిలువునా కూల్చివేశారు. వరంగల్ నగరంలో గిర్మాజిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గిర్మాజిపేట కు చెందిన ముజామిల్ షరీఫ్ అనే వ్యక్తి పాత భవనం కొనుగోలు చేసి మరమ్మతులు చేపట్టాడు.
ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనానికి మధ్య ఒక్కటే అడ్డుగోడ ఉంది. దీనిని కూల్చేందుకు ఆ భవనం యజమాని అంగీకరించలేదు. పాతకాలం నాటి గోడ కా వడం వల్ల ఎక్కువ మందం (సుమారు 18 ఇంచులు)ఉంది. అందులో తనకు చెందిన 9ఇంచుల వరకు బెడ్ పోసుకునేందుకు పక్క భవనం యజమాని అంగీకరించాడు. ఈ నిర్మాణ పనులను షరీఫ్ తాపీ మేస్త్రీ శ్రీను అనే వ్యక్తికి అప్పగించాడు.
18ఇంచుల గోడ లో సగం 9ఇంచుల వరకు గాలా తీసి అందులో ఇనుప రాడ్లు పెట్టే క్రమంలో పాత గోడ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో దేశా యిపేటకు చెందిన సబీరాం సాగర్(26), సుందరయ్యనగర్‌కు బోసు సునీత(24)లు అక్కడికక్కడే చనిపోయారు. మేస్త్రీతోపాటు మరో కూలీ జ్యోతి కొద్దిపాటి గాయాలతో బయట పడ్డారు.
అనాథలైన పిల్లలు..
గోడ కూలిన ఘటనలో చనిపోయిన సునీత భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. ఈమెది మంచిర్యాల కాగా, పని కోసం నగరానికి వచ్చి సుందరయ్య కాలనీలో అత్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. సునీత చనిపోవడంతో వృద్ధురాలు, పిల్లలు అనాథలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషించే కోడలు చనిపోవడంతో ముగ్గురు పిల్లలతోపాటు తాను ఎలా బతకాలని వృ ద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇంటికి పెద్దదిక్కు పోయాడు
దేశాయిపేటకు చెందిన సబీరాం సాగర్ తండ్రి సూరిబాబు తోళ్ల కార్ఖానాలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కార్ఖానాలు మూతపడటంతో జీవనోపాధి లేకపోవడం తో సాగర్ చదువును మధ్యలోనే ఆపి భవన నిర్మాణ రంగంలో సలాక(ఐరన్) కార్మి కుడిగా మారాడు. రోజూ కూలీకి వెళ్తూ తమ్మున్ని చదవిస్తున్నాడు. సాగర్ చనిపో వడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment