తానొక ఎమ్మెల్యే అయినా.. తను కూడా మామూలు వ్యక్తినే అంటూ వ్యవసాయ కూలీలతో మమేకమై, ముచ్చటిస్తూ వారి తెచ్చుకున్న సద్దన్నం ఆరగించారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించనున్న స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వ్యవసాయ గిరిజన కూలీలను దయాకర్ రావు పలకరించారు.
వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి తెచ్చుకున్న సద్దన్నం అడిగి తీసుకొని తిన్నారు. అంతే కాకుండా కూలీలతో జొన్న రొట్టె లేదా? నాకు జొన్న రొట్టె కావాలి ! అని చలోక్తులు విసిరారు. ఎర్రబెల్లి జొన్నరొట్టె అడగటంతో ' సారూ మీరు వస్తారని తెల్వదు.. సాయంత్రం రండి సారూ.. మీకు పచ్చ కూర, జొన్న రొట్టె తీసుకొస్తా.. తిందురు ' అని కూలీలు ఎర్రబెల్లితో ఆనందగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment