గోడ కూలి ముగ్గురు కూలీల దుర‍్మరణం
Published Sat, Jan 7 2017 2:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
వరంగల్: వరంగల్ శివారులోని ఎనమాముల గ్రామం వద‍్ద ఉన‍్న వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక‍్కడికక‍్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మిల్లులో పనిచేస‍్తున‍్న కూలీలు ప్రహరీ గోడ వద‍్ద కూర్చుని ఉండగా గోడ ఒక‍్కసారిగా కూలిపోయింది. దాంతో కొమ‍్ము స‍్వరూప, ఎం.స‍్వరూప, ఉల్లి రేణుక అనే మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో ఆస‍్పత్రికి తరలించారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం మార్చురీకి తరలించారు. మృతులందరూ ఎనమాముల గ్రామానికి చెందినవారు.
Advertisement
Advertisement