Orphaned Childrens
-
గోడ కూలుతుందని చెప్పినా వినలేదు
వరంగల్/రామన్నపేట: పాతకాలం నాటి మట్టి గోడను కదిలిస్తే కూలిపోతుందని యజమానికి, మేస్త్రీకి ఎంత చెప్పినా వినిపిం చుకోలేదు. యజమాని, మేస్త్రీలు కలసి నిర్ల క్ష్యంగా గోడను కదిపి కూలీల జీవితాలను నిలువునా కూల్చివేశారు. వరంగల్ నగరంలో గిర్మాజిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గిర్మాజిపేట కు చెందిన ముజామిల్ షరీఫ్ అనే వ్యక్తి పాత భవనం కొనుగోలు చేసి మరమ్మతులు చేపట్టాడు. ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనానికి మధ్య ఒక్కటే అడ్డుగోడ ఉంది. దీనిని కూల్చేందుకు ఆ భవనం యజమాని అంగీకరించలేదు. పాతకాలం నాటి గోడ కా వడం వల్ల ఎక్కువ మందం (సుమారు 18 ఇంచులు)ఉంది. అందులో తనకు చెందిన 9ఇంచుల వరకు బెడ్ పోసుకునేందుకు పక్క భవనం యజమాని అంగీకరించాడు. ఈ నిర్మాణ పనులను షరీఫ్ తాపీ మేస్త్రీ శ్రీను అనే వ్యక్తికి అప్పగించాడు. 18ఇంచుల గోడ లో సగం 9ఇంచుల వరకు గాలా తీసి అందులో ఇనుప రాడ్లు పెట్టే క్రమంలో పాత గోడ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో దేశా యిపేటకు చెందిన సబీరాం సాగర్(26), సుందరయ్యనగర్‌కు బోసు సునీత(24)లు అక్కడికక్కడే చనిపోయారు. మేస్త్రీతోపాటు మరో కూలీ జ్యోతి కొద్దిపాటి గాయాలతో బయట పడ్డారు. అనాథలైన పిల్లలు.. గోడ కూలిన ఘటనలో చనిపోయిన సునీత భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. ఈమెది మంచిర్యాల కాగా, పని కోసం నగరానికి వచ్చి సుందరయ్య కాలనీలో అత్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. సునీత చనిపోవడంతో వృద్ధురాలు, పిల్లలు అనాథలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషించే కోడలు చనిపోవడంతో ముగ్గురు పిల్లలతోపాటు తాను ఎలా బతకాలని వృ ద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంటికి పెద్దదిక్కు పోయాడు దేశాయిపేటకు చెందిన సబీరాం సాగర్ తండ్రి సూరిబాబు తోళ్ల కార్ఖానాలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కార్ఖానాలు మూతపడటంతో జీవనోపాధి లేకపోవడం తో సాగర్ చదువును మధ్యలోనే ఆపి భవన నిర్మాణ రంగంలో సలాక(ఐరన్) కార్మి కుడిగా మారాడు. రోజూ కూలీకి వెళ్తూ తమ్మున్ని చదవిస్తున్నాడు. సాగర్ చనిపో వడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. -
ఆప్యాయత అల్లుకున్న ’మన ఇల్లు‘
పెద్దాపురం: స్పందించే మనసుంటే చాలు...సేవ చేయాలనే తపన ఉంటే చాలు..ఆదుకోడానికి పెద్దగా ఆస్తిపాస్తులక్కరలేదని చెప్పడానికి ఆయనే నిదర్శనం. అయినవాళ్ల ఆదరణకు దూరంగా ..వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆసరా ఇస్తున్న ఆయన పేరు అల్లవరపు సత్యన్నారాయణ. బాల్యంలో తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పడిన బాధల్ని కళ్లారా చూశారు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోతే ఎదురయ్యే పరిస్థితులనూ చూశారు. ఆవే ఆయన్ను ప్రభావితం చేశాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే తత్వాన్ని పెంచాయి. ఫలితంగా ఆయన నేతృత్వంలో 2016లో కాకినాలో ఆవిర్భవించిందే బాధ్యత స్వచ్ఛంద సంస్థ. తనలాంటి స్వభావమున్న మరో ఏడుగురు ఈయనకు తోడయ్యారు. నాటి ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రోత్సాహమూ బలమైంది. తొలుత కాకినాడలో అనాథ బాలలు గుర్తించి, దిశ వన్ స్టాప్ సర్వీస్‌ల సహాకారంతో సేవలకు శ్రీకారం చుట్టారు. మేమున్నామని.. జీజీహెచ్‌లో ఏ దిక్కూ లేని వృద్ధుల వైద్యసేవలకో వార్డు ఉంది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న వారెవరికీ తెలియదు. వీరికోసం ఎవరూ అక్కడికి రారు. ఈ వార్డుకు సత్యనారాయణ బృందం వెళుతూ వారికి సపర్యలు చేస్తున్నారు. వీరికి తామే ఎందుకు ఆసరా కల్పించకూడదనే ఆలోచనతో పెద్దాపురంలో మన ఇల్లు ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిది మందితో ఆరంభమైన మన ఇల్లులో ఇప్పుడు 29మంది ఉంటున్నారు. సహచరులు.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు సత్యనారాయణ ఆలోచనకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు చేయూతనిస్తున్నారు. మన ఇల్లులో ఉన్నవారెవరికీ తాము అనాథలం అనే భావన రానీయకుండా సాకుతున్నామని సత్యనారాయణ చెప్పారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు, వేళకు భోజనం సమకూర్చుతున్నారు. వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉంచుతున్నారు మన ఇల్లు నిర్వాహకులు. అసోం నుంచి రైలు ప్రమాదంలో అనారోగ్యం పాలై మతిస్థిమితం కోల్పోయిన శ్రీదౌహరుకు మూడేళ్లపాటు సేవలందించారు. తర్వాత కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఇటీవల వారిని రప్పించి అతడ్ని స్వస్థలానికి పంపించారు. ఈవిషయంలో మన ఇల్లు నిర్వాహకుడు సత్యనారాయణ పోషించిన పాత్రను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. జీజీహెచ్‌లో అనాథలుగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలకు సత్యనారాయణ బృందం అంతిమ సంస్కారాలను నిర్వహించింది. కాళ్లు చచ్చుబడిన స్థితి నుంచి ఇలా ఉన్నా.. నాది రాజమహేంద్రవరం. నాకు అందరూ ఉన్నారు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచాన పడ్డాను. కాకినాడ తిమ్మాపురానికి చెందిన నా సోదరి జీజీహెచ్‌లో చేర్పించింది. నా పరిస్థితి గుర్తించి సత్యన్నారాయణ పెద్దాపురంలోని మన ఇల్లుకు తీసుకువచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతున్నాను. – వెంకటరమణ, రాజమహేంద్రవరం ఆ వృద్ధులందరూ అమ్మానాన్నలే.. పెద్దాపురంలో మూడేళ్లుగా ‘మనఇల్లు’ను ప్రారంభించాం. ప్రస్తుతం 29 మంది వృద్ధులు ఉన్నారు. వీరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కొందరికి ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. వీరంతా అనాధ వృద్ధులు కాదు. నాకు అమ్మా నాన్నలే. వృద్ధులైన వారిపై కుటుంబీకులు నిరాదరణ చూపడం సరికాదు. పెద్దలను గౌరవిస్తూ సేవలందించాలి. – అల్లవరపు సత్యనారాయణ, ‘మన ఇల్లు’ సంస్థ నిర్వాహకుడు -
కోవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు సీఎం వైఎస్ జగన్ ఆర్థిక భరోసా
-
చిన్నారికి ఆర్థిక భరోసా: కన్నీరు తుడిచి.. ధైర్యం చెప్పి..
ఏలూరు (మెట్రో): కోవిడ్ కారణంగా ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటకు చెందిన మూడేళ్ల చిన్నారి మన్నేల్లి సునందకు రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారి సంరక్షకురాలైన అమ్మమ్మ కొత్తపల్లి భద్రమ్మకు ఏలూరు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులను అందజేశారు. చిన్నారి సునంద తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తుండగా, తండ్రి వీరాస్వామి ఏప్రిల్ 22న, తల్లి లక్ష్మి ఏప్రిల్ 26న కోవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. రూ.10 లక్షలను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి, దానిపై ప్రతి నెలా వచ్చే వడ్డీతో చిన్నారి పోషణ నిమిత్తం వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని, పాపకు 25 ఏళ్లు నిండిన తరువాత నగదు పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారిని ఓదార్చారు. బాగా చదివించి మంచి ప్రయోజకురాలిని చేయాలని ఆమె అమ్మమ్మను కోరారు. ఎస్పీ కే.నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి, ఐసీడీఎస్ పీడీ కే.విజయకుమారి, గుండుగొలనుకుంట అంగన్వాడీ టీచర్ నిమ్మల అనంతలక్ష్మి ఉన్నారు. చదవండి: శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా!
కాకినాడ సిటీ/గోకవరం/కాకినాడ రూరల్: తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలకు రూ.10లక్షల బాండ్లను అందజేసే కార్యక్రమం కాకినాడలోని కలెక్టరేట్లో బుధవారం ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. ఇద్దరు బాధిత చిన్నారులకు రూ.10 లక్షల వంతున బాండ్లను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోవిడ్ ప్రభావిత కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారితో పాటు గోకవరంలో సంరక్షుల వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారుల డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలను కలెక్టర్ అందించారు. కోవిడ్ విపత్తు కారణంగా తల్లితండ్రులు చనిపోతే పిల్లలు అనాథలు కాకుండా రూ.10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. జిల్లాలో వెంటనే అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చుతున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. బాధిత చిన్నారుల పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి బాండ్‌ను అందించనున్నట్లు వివరించారు. 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుందని, అప్పటి వరకు వడ్డీ మొత్తాన్ని నెలవారీగానీ, మూడు నెలలకోసారి గానీ తీసుకోవచ్చన్నారు. ఈ సొమ్ము చదువుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధిక వడ్డీ చెల్లించేలా చూడాలని ఆయన బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్నారుల వైనాలను ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయాలని అందరినీ కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్ఎం ఎన్.ప్రసన్నకుమార్, డీసీపీవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు డాక్టరువు కావాలమ్మా.. నీకెదురైంది మామూలు కష్టం కాదమ్మా..పదకొండేళ్లకే తల్లితండ్రులను కోల్పోయావు. మాయదారి కోవిడ్ ఇద్దరినీ మింగేసింది. నిన్ను ఒంటరిని చేసింది. నీలా మరొకరు బాధ పడకుండా ఉండాలంటే నువ్వు డాక్టర్ కావాలి. కాకినాడ మెడికల్ కళాశాలలో చదవాలి. అందుకే బాగా చదువుకో. నీలాంటి చిన్నారులు అనాథలు కాకూడదనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. – శరణ్యతో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి రెండు రోజుల్లో అమ్మానాన్నా చనిపోయారు కోలమూరుకు చెందిన పెరువల్లి రాజేష్ పెయింటర్‌గా పని చేసేవాడు. అతనికి భార్య రాణి, ఇద్దరు కుమారులు హెరిన్ (7), శశి (2) ఉన్నారు. రెండు వారాల క్రితం రాజేష్, అతని భార్య రాణి కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 15న రాజే‹Ù, 17న రాణి మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో వీరి కుమారులు అనాథలయ్యారు. వరుసకు చిన్నాన్న, పిన్ని అయిన గోకవరానికి చెందిన పెరువల్లి కుమార్‌బాబు, మేరిల అక్కున చేర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10లక్షల పథకం చిన్నారులిద్దరినీ ఆదుకుంది. చిన్నారులు, గార్డియన్ల పేరుతో జాయింట్ అకౌంట్ ప్రారంభించి ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వడ్డీతో చిన్నారుల బాగోగులు చూడాలని సంరక్షకులను ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇందిరారాణి కోరారు. శరణ్య ఇప్పుడు ఏకాకి కాదు.. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో వడ్డి బాబ్జీ ఓ ప్రైవేట్ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య కుమారి..11 ఏళ్ల కుమారె (శరణ్య) ఉన్నారు. బాబ్జీ, కుమారిలకు కరోనా సోకింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న బాబ్జి మృతిచెందాడు. మూడు రోజుల తర్వాత కుమారి కన్నుమూసింది. శరణ్య ఏకాకిగా మిగిలింది. బాబ్జీ తల్లితండ్రులు మనమరాలి గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం ప్రవేశపెట్టిన రూ.10లక్షల డిపాజిట్ స్కీం అధికారులు వర్తింపజేశారు. గ్రామ సర్పంచ్ బెజబాడ సత్యనారాయణ చొరవతో మంత్రి కురసాల కన్నబాబు చిన్నారి గురించి తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు. సర్పంచ్ సమక్షంలో కలెక్టర్ ద్వారా రూ.10లక్షల బాండు అందుకున్న శరణ్య తాత కన్నీటిని ఆపుకోలేకపోయారు. సీఎంకు రుణపడి ఉంటామన్నారు. చదవండి: కోవిడ్ బాధితులకు కొండంత అండ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 'వైఎస్సార్ పంటల బీమా' -
34 మంది అనాథ బాలలు గుర్తింపు
సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అనాథ బాలల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా ఇప్పటివరకు 34 మందిని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే 13 మంది ఉన్నట్లు తేలింది. ఇక చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ముగ్గురు, కర్నూలులో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 5 మందిని గుర్తించారు. ఈ చిన్నారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ.10 లక్షలు జమచేయనుంది. వారికి 25 ఏళ్లు నిండాక ఆ సొమ్మును తీసుకోవచ్చు. అప్పటివరకు ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు అనాథలుగా మారిపోకుండా వారికి పునరావాసం కల్పించే చర్యలు చేపడుతున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చాలా మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారన్నారు. ఇలాంటి పిల్లలను చేరదీసి, వారికి జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. ఇందుకోసం 24 గంటలూ పని చేసే 181, 1098 (చైల్డ్ లైన్) టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించి రక్షణ, పునరావాస సేవలు పొందవచ్చన్నారు. అలాగే, తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో పిల్లలను ఎవరూ పట్టించుకోని ఘటనలు కూడా ఉంటాయన్నారు. కరోనాపై భయంతో అపోహలతో అటువంటి పిల్లలను చుట్టు పక్కల వారు, బంధువులు ఆదరించే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి బాలలకు కూడా తల్లిదండ్రులు కోలుకుని ఇంటికి వచ్చే వరకు సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కృతిక శుక్లా తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లా కలెక్టర్లు కూడా పిల్లలను సంరక్షించే చర్యలను పర్యవేక్షించి సేవలు అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. -
అనాథ బాలురకూ ఆశ్రయం!
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వసతి కోసం ఎదురు చూసే బాలుర కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ చేపట్టింది. ఇప్పటివరకు అనాథ బాలికలు, మహిళల కోసమే షెల్టర్ హోంలు నిర్వహిస్తున్న ఆ శాఖ.. ఇక బాలుర కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి ఒక షెల్టర్ హోంను ఏర్పాటు చేశారు. వీటిలో అనాథ బాలికలను నేరుగా చేర్చుకుని ఆశ్రయమిస్తారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలు, ఇతరత్రా కారణాలతో హింసకు, దాడులకు గురైన వారిని సైతం షెల్టర్ హోంలు అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇస్తాయి. బాలికలు, మహిళల కోసం నిర్వహించే ఈ హోంలకు ఆ శాఖ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ హోంలు కొనసాగుతున్నాయి. అయితే బాలుర కోసం ఇప్పటివరకు ప్రత్యేకించి హోంలు లేవు. బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆరు వసతి గృహాలున్నప్పటికీ.. ఇందులో మెజార్టీ పిల్లలు సమాజంలో పొరపాట్లను చేసి వస్తున్న వారే.. మరోవైపు ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాల ద్వారా గుర్తిస్తున్న బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇలా గుర్తించిన వారిని ఎక్కడ వసతి కలి్పంచాలనేది అధికారులకు సమస్యగా మారింది. బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు పంపిస్తున్నప్పటికీ అనాథ బాలలకు ప్రత్యేక హోం అంటూ లేదు. మరోవైపు సింగిల్ పేరెంట్ సంరక్షణ నుంచి బయటపడే వారు, తల్లిదండ్రులున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో వసతి కోసం నిరీక్షిస్తున్న వారిలో బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోంలను తెరిచే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. నెలాఖరుకు కొలిక్కి... అనాథ బాలుర కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోంలు తెరిచే అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక్కడ కేవలం వసతితో పాటు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు అనుబంధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ హోంకు వచ్చే పిల్లల వయసుకు తగిన కార్యక్రమాలు అమలు చేసేలా కొత్త హోంల కార్యాచరణ ఉండనుంది. గత నెల రెండో వారంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాలురకు షెల్టర్ హోం అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనల రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా 10 బాలుర షెల్టర్‌హోంల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ఫ్రీ ఫుడ్
అనూజా బషీర్ ‘ఫ్రీ ఫుడ్ క్యాంపెయిన్’ నడుపుతున్నారు. ఇటువంటి అన్నదానాల గురించి వినీ వినీ ఇదొక పెద్ద విశేషంగా మీకు అనిపించకపోవడం సహజమే. అయితే అనూజ ప్రత్యేకం. ఆమెది కొచ్చి. ఇంజినీరింగ్ చదివింది. కాలేజ్ ప్రాజెక్టు పని మీద స్నేహితులతో కలిసి బెంగుళూరు వెళ్లి, అక్కడి చర్చిగేట్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్‌లో కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనతోనే ఇప్పుడు రోజుకు వంద మందికి పైగా కడుపులు నింపే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు! ఆ రోజు.. వాళ్లకు సమీపంలో ఒక చిన్న పిల్లవాడు కడుపు చేతపట్టుకుని తినేందుకు ఏమైనా ఉంటే పెట్టండి అని హోటళ్ల వాళ్లను అడుగుతుండడం వీళ్లు గమనించారు. అలా సంపాదించిన ఫుడ్‌ని అతడు తనకన్నా చిన్న పిల్లలకు పంచడం కూడా వీళ్ల కంటపడింది. అప్పుడే.. ఆకలితో ఉన్నవాళ్లకు తనూ ఏదైనా ‘షేర్’ చేయాలని అనుకున్నారు అనూజ. ఎర్నాకులంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకు తెలిసినవాళ్లుంటే ఆర్థిక సహకార సమాచారం కోసం వారిని సంప్రదించారు అనూజ. అయితే ఈ దేశంలో ఆహారానికి ఎంత కొరత ఉందో, ఆర్థిక సహాయానికీ అంతే కొరత ఉందని ఆమెకు అర్థమైంది. ఇలా లాభం లేదని కొచ్చిలో ఉన్న ఒక అనాధ ఆశ్రయానికి వెళ్లారు. అందరూ మహిళలే నడుపుతున్న ఆశ్రయం అది. దాదాపు 500 మంది ఉంటారు. వాళ్లందరికీ ప్రతిరోజూ భోజనం సమకూర్చడం పెద్ద పని. అప్పటికీ దాతల సహాయంలో నడుస్తోంది. ఆ భారాన్ని కొంతైనా తగ్గించేందుకు, తన వంతుగా రోజుకు వంద భోజన పొట్లాలను అనూజా ఆ ఆశ్రమానికి ఇవ్వడం ప్రారంభించారు. కెట్టో ఓఆర్జీ అనే పేరుతో ఆన్లైల్లో నిధులను సమీకరించడానికి చేసిన ప్రయత్నం కూడా సఫలం అవడంతో ఇప్పుడు కోళికోడ్, తిరువనంతపురాలలో కొన్ని ఆశ్రమాలకు భోజనం అందించే ఆలోచనలో ఉన్నారు. రెండేళ్లుగా అనూజా ఈ ఆహార ఉద్యమాన్ని నడుపుతున్నప్పటికీ పేరెక్కడా వినిపించలేదు. అయినా ఆకలి సేవకు ఏ పేరు సరిపోతుంది చెప్పండి?! ఫ్రీ–కశ్మీర్ ప్లకార్డును పట్టుకున్నానని అనుకుంది కానీ, ప్రమాదాన్ని పట్టుకున్నానని అనుకోలేదు ఈ యువతి. ఢిల్లీలోని జె.యన్.యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింసకు వ్యతిరేకంగా ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర సోమవారం రాత్రి పొద్దు పోయేవరకు ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో ఈ మహిళ ‘ఫ్రీ కశ్మీర్’ అనే ప్లకార్డ్ పట్టుకుని ఉండటం కాస్త ఆలస్యంగా పోలీసుల కళ్లలో పడింది. ఇక అప్పట్నుంచీ ఆమె కోసం గాలిస్తున్నారు. ఫ్రీ కశ్మీర్ అనడాన్ని ఇంటిలిజెన్స్ కూడా తీవ్రంగా పరిగణిస్తోందనీ, ఆమె కశ్మీర్ మహిళ అయుంటుందా అని ఆరా తీస్తోందని కూడా వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఆమె దృష్టికి వెళ్లినట్లుంది.. వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ‘నేను కశ్మీర్ మహిళను కాదు. నా పేరు మెహెక్ మీర్జా ప్రభు. మాది ముంబై. నేను రైటర్ని. ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ప్లకార్డులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తీసుకున్నాను తప్ప, ఎంపిక చేసుకుని తీసుకోలేదు. అయినా ‘ఫ్రీ కశ్మీర్’ అంటే నా ఉద్దేశం.. ఇండియా నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించమని కాదు.. కశ్మీర్లో ఇంటర్నెట్ నిషేధాన్ని తొలగించమని అక్కడి పౌరుల స్వేచ్ఛను హరించవద్దని..’’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. ఏమైనా.. కొన్ని ఫొటోలు వార్తల్లో ఎప్పటికీ నిలిచిపోయినట్లుగా.. ఈ ఫొటో కూడా నిరసనల చరిత్రలో ‘నిలిచిపోయే’ స్థానాన్ని దక్కించుకోబోతున్నట్లే కనిపిస్తోంది. -
అందమైన మనసు
మనసు అందంగా ఉంటే మనిషి అభిరుచులు కూడా అందంగా ఉంటాయి. ఆసక్తి ఉన్నా ఆసరా లేని మహిళలకు వివిధ ఉపాధి నైపుణ్యాలు నేర్పించి వారికి ఆర్థికంగా తోడ్పాటునిస్తున్న గీతా మిశ్రా.. నాలుగేళ్లుగా అనాథ పిల్లల్నీ చేరదీసి..సొంత ఖర్చుతో.. సొంతవాళ్ల సహకారంతో.. ఆ పిల్లల భవిష్యత్తుగా అందమైన బాటను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, కోఠీలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇరుకు గల్లీలో ఓ మూడంతస్తుల భవనం ఉంది. ఆ బిల్డింగ్‌కి ‘నవజీవన్ ఆర్ఫన్ హోమ్’ అనే బోర్డు ఉంది. సాయంత్రం నాలుగు గంటల వరకు నిశ్శబ్దంగా ఉందా హోమ్. నాలుగుంపావుకు అక్కడికి స్కూల్ వ్యాన్ వచ్చి ఆగింది. బిలబిలమంటూ ఓ ఇరవై మంది పిల్లల వరకు దిగారు. రెండో అంతస్థులో ఉన్న గీతా మిశ్రా దగ్గరకు వెళ్లి ‘‘మమ్మీ! గుడీవినింగ్’’ అని విష్ చేశారు. వాళ్లలో పదేళ్ల దివ్య అయితే ఏకంగా గీతా మిశ్రా ఒళ్లో వాలిపోయింది. ‘‘పెద్దయిన తరవాత నాలాగ ‘మమ్మీ’ అవుతానని అంటోంది’’ అంటూ దివ్య బుగ్గలు పుణికింది గీతా మిశ్రా. ‘‘అవును, మా ఆంటీ నా ఒంటి మీద వాతలు పెడుతుంటే ఈ మమ్మీనే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. మమ్మీ నాలాంటి పిల్లలందరినీ ముద్దుగా చూసుకుంటోంది. అందుకే నేను పెద్దయిన తర్వాత ఆర్ఫనేజ్ పెట్టి అమ్మానాన్నలు లేకుండా కష్టాలు పడే పిల్లలందరికీ మమ్మీనవుతాను’’ అని గీతామిశ్రా మెడను చుట్టుకుని తన చేతి మీదున్న మానిపోయిన గాయాల మచ్చలను చూసుకున్నది దివ్య. నిర్దయకు ఆనవాలు దివ్య అమ్మానాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. అప్పుడు ఆ ఇంటి యజమాని పెట్టిన చిత్ర హింసలకు ఆనవాళ్లే మచ్చలు. ‘‘ఆమెకు కోపం వస్తే ఈ పాప చేతుల మీద వాతలు పెట్టేది, ఆడుకుంటున్నప్పుడు పెద్ద రాయి పైన వేసిందోసారి. అదృష్టవశాత్తూ ఆ బండరాయి తలకు తగల్లేదు’’ అని దివ్య తల నిమురుతూ చెప్పారు గీత. ఆధార్ కార్డులోనూ ఆమే తల్లి గీతామిశ్రా పూర్వికులది ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ జిల్లా. నాలుగు తరాల కిందటే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర పడిన హిందీ కుటుంబం వాళ్లది. ఆమె బాల్యం హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గడిచింది. పెళ్లితో హైదరాబాద్, కోఠీలో స్థిరపడిన మరో మర్వాడీ కుటుంబంలో అడుగుపెట్టారు. సోషల్ వర్కర్‌గా గీత అల్పాదాయ వర్గాలు నివసించే బస్తీల్లో పని చేసేవారు. అక్కడ తాను చూసిన అనాథ పిల్లలను చేరదీస్తూ... వాళ్లకు తానే తల్లయ్యారు. అలా ఓ ఇరవై మంది చిన్నారులకు ‘మమ్మీ, డాడీ’ రెండూ ఆమే అయ్యారు. ఆ పిల్లల స్కూల్ రిజిస్టర్లో గీతా మిశ్రా పేరే ఉంటుంది. ఆరుగురు పిల్లలకైతే ఆధార్ కార్డులో కూడా తల్లిగా ఆమె పేరే ఉంది. అదే గదిలో ఒక టేబుల్ మీద పిల్లల ఆధార్ కార్డుల రికార్డు, బర్త్ సర్టిఫికేట్ల ఫైల్, పిల్లల మెడికల్ రికార్డ్స్ వరుసగా పేర్చి ఉన్నాయి. ఒక గోడకు పిల్లలు జూ పార్క్‌కు వెళ్లినప్పటి ఫొటోలతోపాటు పిక్నిక్లో ఒంటె మీద సవారీ చేస్తున్న ఫొటోలు, బాసరకు ట్రైన్లో వెళ్తున్న ఫొటోలు, జూ పార్క్, బోనాల వేడుక, గురుపూర్ణిమ, జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో చూడడానికి వెళ్లినప్పటి ఫొటోలు ఉన్నాయి. మరో గోడకు క్యాలెండర్లో కొన్ని తేదీలు రెడ్ ఇంకుతో రౌండప్ చేసి ఉన్నాయి. అవి బర్త్‌డేలు, న్యూ ఇయర్ వేడుకలను హోమ్‌లో ఉన్న పిల్లలతో జరుపుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్లు రిజర్వ్ చేసుకున్న తేదీలు. భగవంతుడే నడిపిస్తున్నాడు ఒక మామూలు మహిళ ఇంత పెద్ద బాధ్యతను తలకెత్తుకోవడం గురించి గీతా మిశ్రా ఇలా అన్నారు. ‘‘నాది సంకల్పం మాత్రమే. నడిపిస్తున్నది ఆ భగవంతుడు. నాకు బరువు కలగకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చును పంచుకున్నారు. ‘నిరాధార్∙గుజరాతీ జైన్ సేవా సమితి’ వాళ్లు నెలకు ఇరవై వేలిస్తారు. హోమ్ నిర్వహణ కోసం ఒక కుక్, ఒక కేర్‌టేకర్, ఒక ట్యూటర్ ఉన్నారు. వాళ్ల జీతాలకు ఆ డబ్బు సరిపోతుంది. మా అమ్మ విద్యామిశ్రా, స్నేహితులు ఆర్తి పాటిల్, లతారెడ్డి, నావల్ కిశోర్, ఓం ప్రకాశ్, ఉర్మిళ క్రమం తప్పకుండా ప్రతినెలా రెండు–మూడు వేలిస్తారు. ఉర్వి అనే మరో ఫ్రెండ్ అప్పుడప్పుడూ కిరాణా సరుకులు తెచ్చి పెడుతుంటుంది. స్కాల్ (ఎస్కెఏఎల్) మెంబర్ రవీశ్ దవే పిల్లలకు నెలకోసారి స్టార్ హోటల్ ఫుడ్ పంపిస్తారు. కొంతమంది వాళ్లకు తోచినప్పుడు పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కు పాలు, బిస్కట్, అరటి పండ్లను స్పాన్సర్ చేస్తారు. నేరుగా పాలవాళ్లకు, అరటిపండ్ల వాళ్లకు డబ్బిచ్చి ఎన్ని రోజులు వేయాలో చెప్తారు. మిగిలిన రోజులకు నేను పే చేసుకుంటాను. నేను బ్యూటిషియన్‌గా హోమ్సర్వీస్ చేస్తాను కాబట్టి మంచి ఫీజు ఇస్తారు. ఆ భగవంతుడి దయ వల్ల మా ఇంట్లో నా సంపాదన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. అమ్మాయిలిద్దరికీ పెళ్లయింది. ముంబయిలో ఉంటారు. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా వారు ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ఆర్ఫన్ హోమ్ కోసం ఇల్లు వెతుకుతున్నప్పుడు ఎవరూ ఇల్లు అద్దెకివ్వలేదు. ఆ టెన్షన్‌తో నాకు బీపీ ఒడిదొడుకులు, షుగరూ వచ్చేశాయి. అప్పుడు మా వారు, పిల్లలు నాకు నచ్చచెప్పి ఈ ఇంట్లోనే హోమ్ నడుపుకోమన్నారు. ఇప్పుడు మేము కాచిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాం’’ అని ఈ హోమ్ నిర్వహణలో ఎవరెంతెంత సహాయం చేస్తున్నారో చెప్తూ ‘ఒక మంచి పని చేస్తుంటే కలిసి వచ్చే చేతులు సమాజంలో చాలానే ఉన్నాయి’’ అన్నారు గీతామిశ్రా. మంచి డాక్టర్లు దొరికారు హోమ్‌లోని పిల్లలకు విద్యతో పాటు వైద్యానికి కూడా తనకు దేవుడు మంచి దారిని చూపించాడు అన్నారు గీత. ‘‘డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ బోలే ఇద్దరూ పిల్లలకు ఏ సమయంలో అవసరం వచ్చినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అనాథ బిడ్డల బాధ్యత తీసుకోవడం అంటే... వాళ్లకు ఉండడానికి నీడనిచ్చి, కట్టుకోవడానికి దుస్తులిచ్చి, వేళకింత అన్నం పెట్టడం మాత్రమే కాదు. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి మంచి జీవితంలో స్థిరపడడానికి ఒక దారిని కూడా వేయాలి. పిల్లల చదువే నా మొదటి ప్రాధాన్యత. మొదట్లో మా హోమ్‌కు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాను. అక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఉంది కదా అనుకున్నాను. అయితే ఆ స్కూల్లో పిల్లలకు చదువు మీద ఇష్టం కలగలేదు. దాంతో నల్లకుంటలోని ‘వామాక్షి విద్యానికేతన్ హైస్కూల్’లో చేర్చాను. ఆ స్కూల్ ప్రిన్సిపల్ పద్మ ఫీజు రాయితీ ఇచ్చారు. రాయితీ పోగా కట్టాల్సిన ఫీజును కూడా సిటీలో ఉన్న మా మార్వాడీ కమ్యూనిటీలో రామకృష్ణ, రమ, శకుంతల వంటి వాళ్లు ఏడాది మొత్తానికి ఒకేసారి కట్టేస్తున్నారు. నందకిశోర్ వ్యాస్ వంటి ఎందరో సహాయం చేస్తున్నారు. ఈ పిల్లలను నా దగ్గరకు చేర్చిన భగవంతుడే జరగాల్సిన వాటికి కూడా దారి చూపిస్తున్నాడు’’ అన్నారామె సంతోషంగా. ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంది ‘‘మా పిల్లలు ఊరికే స్కూలుకుపోవడం కాదండీ, ఇదిగో... ఈ నికిత స్కూల్ టాపర్, కలెక్టర్ కావాలని తన కోరిక. అమ్ములు, జీవన, శిరీష, పూజ తమ క్లాస్‌లకు లీడర్లు. ఈ చిన్నారులకు భవిష్యత్తు మీద ఎంత పెద్ద ఆలోచనలున్నాయో అని చెబుతూ.. ‘‘మోనికా నువ్వేమవుతావు’’ అని అడిగారు గీతామిశ్రా. వెంటనే మోనిక ‘డాక్టర్’ అని, నూతన ‘హార్స్ రైడర్’ అని, హేమలత ‘పోలీస్’, మరో నికిత ‘టీచర్’’, జీవన ‘కలెక్టర్’ అని చెప్పారు. శిరీష ఎయిర్‌హోస్టెస్ అవుతానని చెప్పింది, అంకిత మాత్రం ‘నేను హీరోయిన్నవుతా’ అని సిగ్గుపడిపోయింది. ఇంతలో ఓ పాపాయి ‘‘మేము ఫ్లయిట్ ఎక్కుతాం’’ అన్నది. ‘‘ట్రూజెట్ వాళ్లు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ప్రోగ్రామ్‌లో పేద పిల్లలకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తున్నారు. ఈ సారి ఆ ట్రిప్‌లో మా హోమ్ పిల్లలను కూడా తీసుకెళ్లనున్నారు’’ అని చెప్పారు గీతామిశ్రా. – వాకా మంజులారెడ్డి ఎలాగైనా ప్రభాస్‌ని చూపించాలి ‘‘స్వర్ణజయంతి షహరి రోజ్‌గార్ యోజన’లో భాగంగా అల్పాదాయ వర్గాల నివాస ప్రదేశాల్లోని మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, బ్యూటీషియన్ కోర్సుల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాను. రేషన్‌కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ల వంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో జరగాల్సిన పనులు చేయించడంలో సహాయంగా ఉండేదాన్ని. కాలనీ వాళ్లు తల్లిదండ్రులు లేక నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూపించి వాళ్లకు ఏదో ఒక దారి చూపించమని అడిగేవాళ్లు. అలా ఒక్కొక్కొళ్లనీ మా ఇంటికి తెచ్చుకున్నాను. ఇంతమంది పిల్లలకు తల్లినయ్యాను. మా పిల్లలు సినీ యాక్టర్ ప్రభాస్‌ను చూపించమని మారాం చేస్తున్నారిప్పుడు. ఎలాగైనా సరే వాళ్ల ముచ్చట తీర్చాలి. -
హోమ్లీ హోమ్
నలభై ఏళ్లుగా అనాథ బాలలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇస్తున్న డాక్టర్ గీత దంపతులు.. ఇప్పుడు మరొక హోమ్లీ హోమ్‌తో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఓ పదమూడేళ్ల అమ్మాయి. తమ ఊరికి వచ్చిన డాక్టర్ల బృందాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ మెడికల్ టీమ్ ఆ ఊరి వాడల్లో పర్యటిస్తోంది. ఒక్కొక్కరు వచ్చి తమ అనారోగ్యం గురించి చెబుతున్నారు. డాక్టర్లు మందులు ఇచ్చి ఎలా వాడాలో చెబుతున్నారు. అప్పుడే టీనేజ్లోకొచ్చిన ఆ అమ్మాయికి ఆ సన్నివేశం అద్భుతంగా అనిపిస్తోంది. మెడికల్ టీమ్ పని పూర్తి చేసుకుని తిరిగి పట్నం పోవడానికి సిద్ధమైంది. వాళ్ల వెంటే వెళ్తున్న అమ్మాయికి ఓ గుడిసెలో నుంచి మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ‘‘డాక్టర్లొచ్చారు చూపించుకుందువు గాని రా’’ అని ఆ అమ్మాయిని లేపింది. లేచే పరిస్థితిలో లేదా అమ్మాయి. ఆమెను లేపి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గుడిసె బయటకు వచ్చి చూస్తే మెడికల్ టీమ్ ముందుకు వెళ్లిపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ‘‘ఓ అమ్మాయి మంచం మీద నుంచి లేవలేకపోతోంది. వైద్యం చేద్దురు రండి’’ అని చెప్పి, మెడికల్ టీమ్‌ను వెనక్కు తీసుకు వచ్చి, జ్వరంతో బాధపడుతున్న అమ్మాయికి వైద్యం చేయించింది. ఇది జరిగి యాభై ఏళ్లవుతోంది. ఆ రోజే నిర్ణయించుకుంది ఆ అమ్మాయి తాను డాక్టర్ని కావాలని, వైద్యం అందని వాళ్లకు వైద్యం చేయాలని. అనుకున్నట్లే డాక్టర్ అయ్యి, దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యం అందని, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం చేస్తోంది. ఆమే.. డాక్టర్ గీతా ఏరువ. గీత.. ఆధ్యాత్మిక సేవామార్గం పట్టడానికి ప్రేరేపించిన సందర్భం అది. ఏదీ వృథా కాకూడదు డాక్టర్ గీత సొంతూరు కర్నూలు జిల్లా కౌలూరు. ఆమె పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. తండ్రి బాలిరెడ్డి మిలటరీ ఆఫీసర్. ఆయన పెంపకం తనకు ‘ఇవ్వడాన్ని’ నేర్పిందని అంటారు గీత. ‘‘నేనీ గౌను వేసుకోను అంటే మా నాన్న వెంటనే ‘మరి దీనిని ఏం చేద్దాం’ అని అడిగేవారు. ఈ గౌనులో పత్తి పండించిన రైతు శ్రమ ఉంది, రంగులద్దిన కార్మికుని శ్రమ ఉంది. కుట్టిన టైలర్ పని ఉంది. ఇంతమంది పని ఉంది ఈ గౌను వెనుక. అలాగే నేను పడిన శ్రమతో సంపాదించిన డబ్బుతో కొన్నాను. అంతకంటే ఎక్కువగా... ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరు. దీనిని ఉపయోగించకపోవడం తప్పు. నువ్వు వేసుకోకపోతే మరొకరికి ఇవ్వు. వనరులను వృథా చేయకూడదు’ అని చెప్పారు. మిలటరీలో పనిచేయడం వల్ల ఆయనలో వెల్లివిరిసిన సేవాభావం అది. మాకూ అవే నేర్పించారు. ఇప్పటికీ మాకెంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని మిగిలినది లేని వాళ్లకు ఇవ్వడం అలవాటైంది. టామ్ (భర్త థామస్ రెడ్డి) క్రైస్తవ మిషనరీ నేర్పించిన కరుణ, సేవా ప్రభావంతో పెరిగిన వారు కావడంతో మా ఇద్దరికీ సేవ చేయడమే జీవితం అయింది’’ అన్నారు డాక్టర్ గీత. మా తర్వాత కూడా పిల్లల్లేని దంపతులు తమకు పిల్లల్లేని కారణంగా అనాథాశ్రమాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటారు. టామ్– గీత దంపతులు ఏకంగా అనాథాశ్రమాలనే దత్తత తీసుకున్నారు. స్వయంగా ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ (ఎఫ్సీఎన్)’ను స్థాపించి అనాథ, పేద పిల్లల కోసం స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. తల్లిదండ్రులు ఉండి పై చదువులకు ఫీజు కట్టుకోలేని పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండువేల ఐదు వందల మంది విద్యార్థులు వీళ్ల సంస్థల ద్వారా జీవితాలను నిలబెట్టుకున్నారు. ఇంత విస్తృతమైన సర్వీస్ చేయాలంటే డబ్బవసరం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అందుకు ఈ దంపతులు ఇక్కడి పిల్లలను అమెరికా నుంచి దాతలతో అనుసంధానం చేశారు. ‘‘మాకు విరాళాలిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది మేము అమెరికాలో ఉద్యోగం చేసినప్పటి మా ఫ్రెండ్సే. ఫండ్ రైజింగ్ కోసం ఏటా ఆరు నెలలు అమెరికాలో ఉంటున్నాం. మాకు వయసై పోయిన తర్వాత ఈ సర్వీస్ ఆగిపోకుండా కొనసాగేటట్లు సిస్టమ్‌ను డెవలప్ చేయడమే ఇప్పుడు మా ముందున్న ఆలోచన. అందుకే అవకతవకలకు అవకాశం లేని విధంగా ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు డాక్టర్ గీత. – వాకా మంజులారెడ్డి రెండు వందల మందికి మా అమ్మానాన్నలు ఆంతోనమ్మ, శౌరిరెడ్డిల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల, ధర్మవరం, గుంటూరు, జడ్చర్ల, నంద్యాల, మైదుకూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కడప, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలు, హోమ్‌లను స్థాపించాం. ఇప్పుడు షాద్ నగర్లో నిర్మించిన హోమ్‌లో ఒక్కో గదికి ఒక్కో దాత పేరు ఉంటుంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వాళ్లు తాము ఉంటున్న గదికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ల పేరును రోజూ గుర్తు చేసుకుంటారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా విశ్వాసం. సేవాశ్రమంలో రెండు వందల మందికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆశ్రయం అవసరమైన వాళ్లకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. – థామస్‌రెడ్డి, ఎఫ్సీఎన్ నిర్వాహకులు పిల్లలకు అందరూ ఉండాలి హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్‌లో స్థాపించిన మా ‘సేవాశ్రమం’ జనవరి 23న ప్రారంభం అవుతోంది. మా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలను పిల్లలకు అనుభవంలోకి తేవడమే. పిల్లలు తమకు ఎవరూ లేరనే నిస్పృహలో పెరగకూడదు. వృద్ధులు కూడా మరణం కోసం ఎదురు చూస్తూ రోజులు గడపకూడదు. జీవించి ఉన్నన్ని రోజులూ సంతోషంగా గడపాలి. అలాగే దివ్యాంగులు కూడా ఏదో బతుకీడుస్తున్నాం అనే నిర్వేదంలో మునిగిపోకుండా తాము చేయగలిగిన సర్వీస్ ఇతరులకు చేయగలుగుతున్నామనే మానసికానందంతో జీవించాలి. అందుకోసం పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్‌లను ఒకే ప్రాంగణంలో నిర్మించాం. – డాక్టర్ గీత, ఎఫ్సీఎన్ నిర్వాహకురాలు -
అక్రమాల బాలసదన్..!
మంకమ్మతోట(కరీంనగర్): అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. విద్యాబుద్దులు చెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాలసదన్ అక్రమాల పుట్టగా మారింది. జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఐసీడీఎస్ పరిధిలో నడుస్తున్న బాలసదన్ అధికారులు పిల్లల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఏటా బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అనాథ బాలలు ఉంటున్న బాలసదన్లు, ఆ శాఖ అధికారుల పనితీరుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం బాలసదన్‌లో ఉంటున్న బాలల పట్ల సంరక్షణ కరువై రోగాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఏటా బాలసదన్ నిర్వహణకు కాస్మోటిక్ చార్జీల పేరుతో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. పిల్లలకు చేరడం లేదు. వారి పరిశభ్రత పట్ల అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో చర్మవ్యాధులు, ఇతర రోగాలతో సతమతమవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయం ఉంటున్నారు. వీరికి ఆశ్రయం కల్పించడంతోపాటు విద్యాబుద్దులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పనిచేస్తున్న అధికారి బాలల సంరక్షణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ శాఖ సిబ్బంది బాహాటంగా ఆరోపిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఆవిర్భావ దినోత్సవాలతోపాటు నాయకులు, సినీ నటుల ఫ్యాన్స్ వేడుకలను బాలసదన్‌లో జరుపుకునేందుకు వస్తుంటారు. వీరంతా పిల్లల మధ్య వేడుకలు జరుపుకొని స్వీట్లు, పండ్లు, ఆట వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, బియ్యం, పప్పులు వంటివి పంపిణీ చేయడంతోపాటు వారందరికి ఉపయోగపడే వస్తువులు ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు, వాషింగ్ మిషన్లు వంటివి కానుకలుగా ఇస్తుంటారు. మరికొంత మంది అవసరమైన వాటిని కొనుక్కోవాలని విరాళాలు అందిస్తుంటారు. ఇలా దాతలు ఇచ్చిన నగదుకు లెక్కలు ఉండకపోగా.. వస్తువులు మాయం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాతలు ఇచ్చిన వాటిలో చాలావరకు కనిపించకపోగా.. మరికొన్ని కొత్తవాటిస్థానంలో పాతవి దర్శనం ఇస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. చెడిపోయిందని మూలనపెట్టి కొద్ది రోజుల తర్వాత వీటిని రిపేర్లపేరుతో బయటికి తీసుకుపోయి పాతవి బాగుచేసి పెడుతున్నట్లు సమాచారం. మొక్కల పెంపకం పేరుతో.. బాలసదన్ ఆవరణలో మొక్కలునాటి వారి సంరక్షించేందుకు దాతల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సిబ్బంది తెలుపుతున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన మొక్కలు, కంచెవంటివి పంపిణీ చేసింది. ఈ మొక్కల పెంపకం సాకుగా చూపి బాలల మధ్య వేడుకలు జరుపుకోవడానికి బాలసదన్‌కు వచ్చిన దాతల నుంచి విరాళాలు వేలల్లో వసూలు చేసినట్లు ప్రజలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలి.. బాలసదన్‌కు విరాళంగా ఇచ్చిన నగదు, వస్తువుల రికార్డులు ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. దాతలు ఇచ్చినపుడే రికార్డుల్లో రాసి వారికి రశీదు వంటివి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
నేను.. మా మమ్మీ, డాడీ!
సాక్షి, హైదరాబాద్: ఫ్రాంక్ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ శిశు గృహంలోని ఓ మూడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. ఇలాంటి దంపతులు ఎందరో.. శిశుగృహాల్లోని పిల్లలు ఇప్పుడు విదేశాలకు దత్తతకు వెళ్తున్నారు. రాçష్ట్రంలో ఇప్పటికి 43 మంది పిల్లలు ఇలా దత్తత తీసుకోవడంతో విదేశాలకు వెళ్లారు. అనాథ శిశువులను దత్తత తీసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ దత్తత కార్యక్రమం ఎల్లలు దాటిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల దత్తత ప్రక్రియలో ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన పిల్లలను విదేశీ యులు దత్తత తీసుకుంటున్నారు. అమెరికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌కు చెందిన కుటుంబాలు మన రాష్ట్రంలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన మార్టిన్ దంపతులు నల్లగొండ జిల్లాకు చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. నిబంధనలు మార్చాక ఇలా.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న అనాథ చిన్నారులను అయినా దత్తత తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీని కోసం ప్రత్యేకంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్సైట్ విధానంతోనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దీంట్లోనూ స్వదేశం(ఇన్ కంట్రీ), విదేశీ(ఇంటర్ కంట్రీ) పేరుతో రెండు విధానాలున్నాయి. స్వదేశీ విధానంతో భారతీయులు, రెండో విధానంతో విదేశీయులు మన దేశంలోని పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మన దేశంలోని అనాథ పిల్ల లను విదేశీయులు దత్తత తీసుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు చేసిన ప్రభుత్వ సంస్థలలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు మన దేశీయులు ఎవరూ సుముఖత వ్యక్తం చేయని సందర్భాల్లో రెండో ఆప్షన్ కింద విదేశీ దత్తత కేటగిరీలోకి మారుస్తారు. దీనికి 90 రోజులు గడువు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చిన విదేశీయులు ‘కారా’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అక్కడి ఏజెన్సీలు దత్తతకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. పిల్లల పెంపకానికి ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే స్వదేశీ దత్తత మార్గదర్శ కాల మేరకు దత్తత పొందేందుకు దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దంపతుల సొంత రాష్ట్రంతోపాటు మరో రెండు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి పిల్లలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతితో జాప్యం లేకుండా గరి ష్టంగా 30 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నరపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. -
ఫ్యాషన్ స్మైల్.. అదిరెన్ స్టైల్..
గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం రాత్రి 51 స్మైల్ బి ద చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్యాషన్ షో అదరహో అనిపించింది. ప్రముఖ మోడళ్లతో కలిసి ఏఆర్ ఫౌండేషన్ అనాథ పిల్లలు ర్యాంప్‌పై మెరిశారు. నటులు శ్రీధర్‌రావు, సనా శనూర్, డ్యాన్స్ మ్యాస్ట్రో సం దీప్, బిగ్‌బాస్ సీజన్–10 లోపాముద్ర ప్రత్యేక ఆ కర్షణగా నిలిచారు. దీనిద్వారా వచ్చిన నిధుల ను అనాథ పిల్లల విద్య కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
నటి షకీలాకు పెళ్లి అయ్యిందా?
తమిళసినిమా: నటి షకీలా బుధవారం పెళ్లి చేసుకున్నారంటూ ఇంటర్నెట్, ఫేస్బుక్లో ఫొటోలు హల్చల్ చేశాయి. ఒకప్పుడు తన అందాల ఆరబోత నటనతో మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేశారు షకీలా. ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగు, తమిళ భాషలలో అనువాదమై వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న షకీలా 28 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలతో సహా సోషల్ నెట్ వర్కులో ప్రచారం అవడం ఆసక్తి కరంగా మారింది. దీనికి స్పందించిన షకీలా ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. నెట్లో ప్రచారం అవుతున్న ఫొటోల్లో తనతో ఉన్న యువకుడు, తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న కథానాయకుడని వివరించారు. అతని వయసు (28) అని, తన వయసు (38)అని, అతను తన తమ్ముడి లాంటివాడని పేర్కొన్నారు. అయినా తనకిప్పుడు పెళ్లి అవసరం ఏముందని ప్రశ్నించారు. పిల్లల కోసం అయినా పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటున్నారని తానిప్పుడు పిల్లల్ని కని భూమికి భారం చేయాలా అని అన్నారు. అలాంటి పెళ్లి, పిల్లలు ఆశ తనకు లేదని స్పష్టం చేశారు. ప్రతి నెలా కొందరు అనాథ బాలలకు కొంత మొత్తాన్ని సాయం చేస్తున్నట్లు షకీలా వెల్లడించారు.