ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అనాథ బాలల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా ఇప్పటివరకు 34 మందిని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే 13 మంది ఉన్నట్లు తేలింది.
ఇక చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ముగ్గురు, కర్నూలులో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 5 మందిని గుర్తించారు. ఈ చిన్నారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ.10 లక్షలు జమచేయనుంది. వారికి 25 ఏళ్లు నిండాక ఆ సొమ్మును తీసుకోవచ్చు. అప్పటివరకు ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment