నల్లగొండ: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు రెండు నెలల కిందే పెళ్లి చేసింది. ఆషాఢ మాసం కావడంతో ఆచారం ప్రకారం ఆ బిడ్డ వారం కింద తల్లి వద్దకు వచ్చింది. గురువారం రాత్రి కలిసి అన్నం తిన్నారు. ముచ్చట్లు చెప్పుకొంటూ పడు కొన్నారు. కానీ జోరు వానకు మట్టిగోడ తడిసి ఇల్లు కూలిపోయింది. దానికింద కూరుకుపోయి తల్లీబిడ్డ ఇద్దరూ కన్నుమూశారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన నడిపూరి లక్ష్మి (47), ఆమె కుమార్తె కల్యాణి (21)గా గుర్తించారు.
రెండు నెలల కిందే పెళ్లి చేసి..
మాకివలసకు చెందిన లక్ష్మి భర్త నాయుడు ఆర్థిక ఇబ్బందులతో పదేళ్ల కింద ఆత్మహత్య చేసుకు న్నాడు. దీనితో పిల్లలు భాస్కర్‌రావు, కల్యాణి ఇద్దరినీ ఆమెనే పోషిస్తోంది. నల్లగొండలోని పద్మా నగర్‌కు వలస వచ్చి మూడేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేసి పెడుతూ జీవిస్తోంది. కల్యాణికి మే 14న శ్రీకాకుళం జిల్లా ధర్మూర్ మండలానికి చెందిన బంధువుల అబ్బాయి శ్రీనుతో వివాహం చేసింది.
బిడ్డ, అల్లుడు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటున్నారు. ఆషాఢ మాసం కావడంతో కల్యాణి వారం క్రితమే తల్లి దగ్గరికి వచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో కుమారుడు బయటపడ్డాడని స్థానికులు చెప్తున్నారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment