ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని తుండ్లా ప్రాంతంలో మంగళవారం గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుందని... గోడ కూలిన సమయంలో కుటుంబంలోని వారంతా నిద్రిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి
Published Tue, May 19 2015 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement