Firozabad
-
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే..
అతనో పోలీస్.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్‌కు చెందిన యువతి(24)తో కానిస్టేబుట్ అమిత్ యాదవ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. ఈ క్రమంలో కాబోయే భర్తే కదా అని ఆమె శారీరకంగా దగ్గరైంది. కాగా, పెళ్లి విషయం ఎత్తగానే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడుగగా.. 2021లో పెళ్లి చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్‌ను నిలదీయగా అదనపు కట్నం కావాలని కోరినట్టు తెలిపింది. ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేసింది. అతని కుటుంబం రూ. 14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. అమిత్‌తో నా వివాహం ఆగస్టు 2021కి నిర్ణయించారు. కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ. 19 లక్షల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుకు తెలపడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫిరోజాబాద్ రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. -
మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..
లక్నో: ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు అన్నీవర్గాల వారికి ప్రభుత్వం నుంచి లాభాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు, కులాలు, వృత్తుల ఆధారంగా అర్హులైన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందేందుకు కొందరు ప్రజలు ఎన్ని తంటాలైన పడుతుంటారు. తాజాగా ప్రభుత్వం ద్వారా అందే డబ్బు కోసం సొంత చెల్లిని ఓ అన్న పెళ్లి చేసుకున్న షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలో జరిగింది. ఫిరోజాబాద్ తుండ్లలో డిసెంబర్ 11న చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఇటీవల సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 జంటలు ఒక్కటయ్యాయి. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువలను కానుకలుగా అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతోపాటు.. మిగతా డబ్బులను ఇతర కానుకల రూపంలో అందిస్తారు. చదవండి: విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! అయితే వీటి కోసం ఆశపడిన ఈ సామూహిక పెళ్లిళ్లో ఓ వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందరిలానే చెల్లెలి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, ఇతర కానుకలను తీసుకొని పారిపోయాడు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో వివాహం చేసుకున్న వారు అన్న చెల్లెల్లు అని గ్రామస్థులు గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. చదవండి: ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 37 లక్షలు సంపాదిస్తోంది.. దీంతో ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్ డెవలప్మెంట్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఫిరోజాబాద్‌లో డెంగ్యూ మహమ్మారి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్ ఫీవర్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. హీమరాజిక్ డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్లెట్ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్ కలెక్టర్ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్–బోర్న్ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్సీడీసీకి చెందిన తుషార్ ఎన్ నేల్ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అలోక్ కుమార్ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్‌లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
వలస కూలీలను అవమానపరిచినందుకు..
ఫిరోజాబాద్ : వలస కార్మికుల పట్ల చిన్నచూపుతో వ్యవహరించిన సీనియర్ రైల్వే అధికారిని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గత సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. డికె దీక్షిత్ ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్లో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత సోమవారం దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా తన టీంతో కలిసి ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా బిస్కెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంతలో వలసకూలీలకు సంబంధించిన శ్రామిక్‌రైలు అక్కడికి చేరుకొంది.దీక్షిత్ వారికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వాలని తన టీంకు తెలిపాడు. (విశాఖ జిల్లాలో విషాదం) అయితే టీం సభ్యులు బిస్కెట్ పాకెట్లను వారి చేతికి అందివ్వకుండా బిస్కెట్ పాకెట్లను చింపి ఒక్కో బిస్కెట్‌ను కంపార్ట్మెంట్లోకి విసిరారు. ఈ సందర్భంగా దీక్షిత్ టీంలోని సభ్యుడు గట్టిగా అరుస్తూ..' ఈరోజు మా సార్ దీక్షిత్ పుట్టినరోజు. అందుకే బిస్కెట్లు పంచుతున్నాం' అంటూ పేర్కొన్నాడు. అయితే వలస కూలీలు మరికొన్ని బిస్కెట్ పాకెట్లు ఇవ్వాలని కోరితే మీకు ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక కిందపడిన బిస్కెట్లు వేస్ట్ కాకుండా తీసుకొని తినేయండి అంటూ వలసకూలీల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది కాస్తా అక్కడి లోకల్ ఆఫీసర్ తన వాట్సప్ గ్రూఫ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.('పటాసులు కాల్చండి.. డ్రమ్ములు వాయించండి') విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీక్షిత్‌తో పాటు అతనితో ఉన్న టీమ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.వలసకూలీలపై అవమానకరంగా ప్రవర్తించడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తన ట్విటర్లో పేర్కొంది. సరిగ్గా వారం కిందట ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆహరం కోసం వలసకూలీలు ఒకరిని ఒకరు తోసుకున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. వలసకూలీలపై వివక్ష చూపిస్తూ రైల్వే అధికారులు ఇలా చేయడం దారుణం అని అభివర్ణించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ రైల్వేశాఖ అధికారులను కోరింది. -
ఘోర రోడ్డు ప్రమాదం; 14 మంది మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం; 14 మంది మృతి
ఫిరోజాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరికి వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడిన పర్సు!
ఫిరోజాబాద్: కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక శివుడి ఫొటో ఉన్న పర్సు ఓ కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడింది. అదెలా అనుకుంటున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల్లో కానిస్టేబుల్ విజేందర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ‘ఆందోళనకారులెవరో కాల్పులు జరిపారు. దీంతో దూసుకొచ్చి న బుల్లెట్ నా జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో కొన్ని నాణేలు, ఏటీఎం కార్డులు, శివుని ఫొటో ఉన్నాయి. నిజంగా నాకిది పునర్జన్మగా భావిస్తున్నాను’అని విజేందర్ చెప్పారు. -
బుర్కాతో విద్యార్థినులు.. అడ్డుకున్న యాజమాన్యం
ఫిరోజాబాద్ : బుర్కా వేసుకున్న కొంతమంది విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించని ఘటన శుక్రవారం ఫిరోజాబాద్ ఎస్ఆర్కె కాలేజీలో చోటుచేసుకుంది. బుర్కాలు వేసుకోవడం యూనిఫాంలో భాగం కానందున వాటిని నిషేదించినట్లు కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.'బుర్కా ధరించి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే తనని అడ్డుకున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు బుర్కా వేసుకొని వచ్చినా ఎప్పుడా ఇలా జరగలేదని, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదని' సదరు విద్యార్థిని వాపోయారు. ఇదే విషయమై కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాస్కర్ రాయ్ మాట్లాడుతూ... మా కాలేజీలో చదివే ఏ విద్యార్థి అయినా తప్పనిసరిగా యూనిఫామ్, ఐడీ కార్డ్ ధరించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతున్నందున రూల్స్ పాటించలేదని, కానీ సెప్టెంబర్ 11న అడ్మిషన్ ప్రక్రియ ముగియడంతో బుర్కా వేసుకున్న విద్యార్థినులను లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, ఇది ఆ కాలేజీ అంతర్గత వ్యవహారమని వెల్లడించారు. కాలేజీ నిబందనల మేరకే విద్యార్థినులు యూనిఫాం, ఐడీ కార్డ్ వేసుకొని రావాల్సిందిగా తెలిపిందని , కానీ బుర్కాలు తొలగించాలని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. కాలేజీ విధించిన నిబంధనలను విద్యార్థులందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు. -
హెల్మెట్ పెట్టుకోలేదు; 4 గంటలు కరెంట్ బంద్!
లక్నో : తనకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులపై ప్రతీకార చర్యగా సదరు ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు ఓ అధికారి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనివాస్ అనే వ్యక్తి దక్షిణాంచల్ విద్యుత్ విట్రన్ నిగమ్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన వ్యక్తిగత పనికోసం బైక్ మీద బయల్దేరారు. అయితే శ్రీనివాస్ హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆయన బండిని ఆపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రూ. 500 చలానా విధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ బకాయిలు చెల్లించని పోలీసులు ఇలా జరిమానా విధించడం సరికాదంటూ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఫిరోజాబాద్ పరిధిలోని పోలీసు స్టేషను.. విద్యుత్ సంస్థకు రూ. 6 లక్షలు బకాయి పడిందని.. అలాంటిది తానెందుకు రూ. 500 జరిమానా చెల్లించాలని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన నుంచి పోలీసులు చలానా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్ పై అధికారులను సంప్రదించకుండానే పోలీసు స్టేషనుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ పోవడంతో పోలీసులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నా భార్యను తీసుకొస్తారా, లేదా?
ఫిరోజాబాద్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన భార్యను వెతికి పెట్టాలంటూ ఓ భర్త విద్యుత్ టవర్ ఎక్కాడు. ఐదు గంటల పాటు టవర్ పైనే గడిపిన అతడు ఉన్నతాధికారుల హామీతో కిందకు దిగి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ లోని అసఫాబాద్ పవర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లల తండ్రైన రాంప్రసాద్(40) హైటెన్షన్ స్తంభం ఎక్కి హడావుడి చేశాడు. 20 రోజుల క్రితం తనను వదిలి వెళ్లిపోయిన భార్యను తీసుకురావాలని డిమాండ్ చేశాడు. తన భార్యను తీసుకురాకుంటే కిందకు దూకేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అధికారులు స్పష్టమైన హామీయివ్వడంతో కిందకు దిగొచ్చాడు. ప్రసాద్ తో గొడవపడి అతడి భార్య వెళ్లిపోయిందని ఫిరోజాబాద్ ఎస్పీ ఓంకార్ యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే ఆమె వెళ్లిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కాగా, హైటెన్షన్ టవర్ ఎక్కి న్యూసెన్స్ చేసినందుకు రాంప్రసాద్ పై పోలీసులు కేసు పెట్టారు. మరోవైపు అతడు సృష్టించిన హంగామాతో సమీప ప్రాంతాలకు 5 గంటల పాటు కరెంట్ లేకుండా పోయింది. -
ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది!
ఎండలు పెట్రేగుతున్నాయి. ఎన్నడులేని రీతిలో దంచి కొడుతున్నాయి. అడవి ఎండిపోతున్నది. కుంటలు, చెరువులు, గుంతుల్లో నీరు ఆవిరవుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నీటి జాడను వెతుక్కుంటూ ఓ మొసలి ఊరిలోకి జనాలను హడలెత్తించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలోని రసాని గ్రామంలో జరిగింది. గ్రామంలోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన మొసలి గురించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఒడుపుగా మొసలిని బంధించారు. ఈ ఉభయచరాన్ని జాతీయ చంబల్ జంతు సంక్షరణ కేంద్రంలోని చంబా నదిలో వదిలివేయనున్నట్టు వారు తెలిపారు. WATCH:Crocodile enters residential area in Firozabad's Darapur Raseni village(UP),later captured by forest officialshttps://t.co/ol38NIoLK7 — ANI (@ANI_news) 22 April 2016 గోవా బీచ్‌లో ఓ మొసలి కనిపించడం.. దాని ఫొటోలు ఆన్లైన్లో వైరల్ కావడం తెలిసిందే. నది పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే మొసళ్లు ఈ మధ్య జనావాసాల్లోకి కూడా వస్తుండటం అలజడి రేపుతున్నది. ఎండలు పెరిగిపోవడం.. నీటికుంటలు తరిగిపోతుండటంతో ఆవాస ప్రాంతాలు లేక ఇలా మొసళ్లు అవస్థ పడుతున్నాయని జంతు ప్రేమికులు అంటున్నారు. -
గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని తుండ్లా ప్రాంతంలో మంగళవారం గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుందని... గోడ కూలిన సమయంలో కుటుంబంలోని వారంతా నిద్రిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా
ఫిరోజాబాద్: అన్నయ్య సరదా తమ్ముడి ప్రాణం తీసింది. సోదరుడి చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది. రామ్‌గఢ్ ప్రాంతంలోని రాపూరాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూడో తరగతి చదువుతున్న పంకజ్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసివున్న తుపాకీని పంకజ్ సోదరుడు యశ్వంత్ సింగ్ సరదా పేల్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ఛాతిలో దిగడంతో పంకజ్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తుపాకీ అక్రమమైందని చెప్పారు. యశ్వంత్ సింగ్ పై 304 కింద కేసు నమోదు చేశారు. -
తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం
ముజఫర్‌నగర్: ఇంటి దగ్గరి నుంచి ఒక బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ముగ్గురు కామాంధులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖేరి ఫిరోజాబాద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికను శనివారం ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి, సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన అనంతరం బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.