మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. | Viral: Brother Marries His Own Sister To Obtain Money From a Govt Scheme | Sakshi
Sakshi News home page

Viral: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..

Published Thu, Dec 16 2021 4:44 PM | Last Updated on Thu, Dec 16 2021 9:36 PM

Viral: Brother Marries His Own Sister To Obtain Money From a Govt Scheme - Sakshi

లక్నో:  ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు అన్నీవర్గాల వారికి ప్రభుత్వం నుంచి లాభాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు, కులాలు, వృత్తుల ఆధారంగా అర్హులైన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందేందుకు కొందరు ప్రజలు ఎన్ని తంటాలైన పడుతుంటారు. తాజాగా ప్రభుత్వం ద్వారా అందే డబ్బు కోసం సొంత చెల్లిని ఓ అన్న పెళ్లి చేసుకున్న షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలో జరిగింది. ఫిరోజాబాద్‌ తుండ్లలో డిసెంబర్‌ 11న చోటుచేసుకున్న  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఇటీవల సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 జంటలు ఒక్కటయ్యాయి. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువలను కానుకలుగా అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతోపాటు..  మిగతా డబ్బులను  ఇతర కానుకల రూపంలో అందిస్తారు. 
చదవండి: విక్టరీ హగ్‌; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్‌ అవుతున్నారు!

అయితే వీటి కోసం ఆశపడిన ఈ సామూహిక పెళ్లిళ్లో ఓ వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందరిలానే చెల్లెలి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, ఇతర కానుకలను తీసుకొని పారిపోయాడు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవ్వడంతో వివాహం చేసుకున్న వారు అన్న చెల్లెల్లు అని గ్రామస్థులు గుర్తించడంతో ఈ విషయం బయటపడింది.
చదవండి: ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 37 లక్షలు సంపాదిస్తోంది..

దీంతో ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement