government scheme
-
Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన (పీఎం-కేఎంవై) ఈ పథకం లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60 ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్బీహెచ్ఎం) తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.5. నమో డ్రోన్ దీదీప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్ -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జలవిహార్ లో జరిగిన మైనార్టీనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘ మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ సన్మానించారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ... మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్. హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు. మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. కాంగ్రేస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. (చదవండి: బర్త్, స్టడీ సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు) దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే. ఈ బడ్జెట్ లో మీ సంక్షేమం కోసం 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినం. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నాం. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మయి నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది. ముస్లింల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. (చంద్రబాబు వారసుడు రేవంత్) -
ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం
డుంబ్రిగుడ: ప్రజల చెంతకే పాలన అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అరకు పంచాయతీ మాడగడ ,అరకు సంతబయలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 355 గడపలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరుపై ఆరా తీశారు. ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, దేశానికి ఆదర్శనీయమంగా నిలిచారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని, నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా అరకు గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన స్పందించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పర్యటించి అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎంపీపీ బాక ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మ, వైస్ ఎంపీపీలు ఆనంద్, లలిత, ఎంపీటీసీలు వరహాలమ్మ, విజయ, సర్పంచ్‌లు శారద, నాగేశ్వరరావు, రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజరమేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గోపాల్, మార్కెట్ కమీటీ చైర్మన్ రాజరమేష్,పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సొర్రు, బీసీ సెల్ అద్యక్షుడు మురళీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. (చదవండి: నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్) -
బాలాజీ నాయుడు మళ్లీ చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులకే టోకరా వేసే ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు మరోసారి చిక్కాడు. ఈసారి ఏపీలోని తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులకు ఎర వేశాడు. ఇప్పటి వరకు 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేసిన ఇతగాడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 30 పోలీసుస్టేషన్లలో ఇతడిపై 33 కేసులు ఉండగా..22 సార్లు జైలుకు వెళ్ళివచ్చాడు. తొలిసారిగా ఓ అనుచరుడిని ఏర్పాటు చేసుకుని నేరం చేశాడు. వీరిద్దరినీ హైదరాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బీటెక్ చదివి... ఏసీబీకి చిక్కి.. ♦ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ కేసు కోర్టులో నిరూపితం కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటి నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు. ఉద్యోగాలు, పథకాల పేర్లు చెప్పి... ♦ఇతగాడు వివిధ మార్గాల్లో ప్రజా ప్రతినిధులు, వారి పీఏల ఫోన్ నెంబర్లు సంగ్రహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలు, సంస్థల్లో ఉద్యోగాలంటూ ఎర వేస్తాడు. వారి నియోజకవర్గాలకు చెందిన అర్హులను ఎంపిక చేయాల్సిందిగా కోరి..ప్రాథమికంగా డిపాజిట్ చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయించుకుని మోసం చేస్తాడు. గతంలో వి.హనుమంతరావు, దేవేందర్ గౌడ్, పాల్వాయి గోవర్థన్, ఆకుల లలిత, రాంజగదీష్.. ఇలా అనేక మంది నుంచి సైతం బాలాజీ నాయుడు డబ్బు గుంజాడు. మనోహర్, లక్ష్మణ్, మల్లేష్ పేర్లతోనూ చెలామణి అయ్యే ఇతగాడు జైల్లో ఉండగా అభిషేక్ అనే యువకుడితో పరిచయమైంది. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ అత్యాచారం కేసులో ఇతడు జైలుకు వెళ్లాడు. ఇటీవలే బయటకు వచ్చిన వీరిద్దరూ ముఠాగా ఏర్పడ్డారు. ఖాదీ కమిషన్ పేరుతో ఎంపీకి... ♦అభిషేక్‌తో కలిసి రంగంలోకి దిగిన బాలాజీ నాయుడు ఇటీవల తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి... కేంద్రం ఆధీనంలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి ఆయన నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని చెప్పాడు. ఈ మొత్తాన్ని పంపిణీ చేయడానికి 20 మంది అర్హులైన వారికి ఎంపిక చేయమని కోరాడు. చలాన్ చార్జీల కోసం ఒక్కో లబ్దిదారుడి పేరుతో రూ.1.25 లక్షలు చెల్లించాలంటూ ఓ బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. అనుమానం వచ్చిన గురుమూర్తి సీఎంఓలో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆయన అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాలాజీ ఇదే పంథాలో ఇక్కడి ఎమ్మెల్సీలకు కాల్స్ చేశాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసుల వలపన్ని ఇద్దరినీ పట్టుకున్నారు. -
మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..
లక్నో: ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు అన్నీవర్గాల వారికి ప్రభుత్వం నుంచి లాభాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు, కులాలు, వృత్తుల ఆధారంగా అర్హులైన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందేందుకు కొందరు ప్రజలు ఎన్ని తంటాలైన పడుతుంటారు. తాజాగా ప్రభుత్వం ద్వారా అందే డబ్బు కోసం సొంత చెల్లిని ఓ అన్న పెళ్లి చేసుకున్న షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలో జరిగింది. ఫిరోజాబాద్ తుండ్లలో డిసెంబర్ 11న చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఇటీవల సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 జంటలు ఒక్కటయ్యాయి. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువలను కానుకలుగా అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతోపాటు.. మిగతా డబ్బులను ఇతర కానుకల రూపంలో అందిస్తారు. చదవండి: విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! అయితే వీటి కోసం ఆశపడిన ఈ సామూహిక పెళ్లిళ్లో ఓ వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందరిలానే చెల్లెలి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, ఇతర కానుకలను తీసుకొని పారిపోయాడు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో వివాహం చేసుకున్న వారు అన్న చెల్లెల్లు అని గ్రామస్థులు గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. చదవండి: ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 37 లక్షలు సంపాదిస్తోంది.. దీంతో ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్ డెవలప్మెంట్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఆడపిల్ల ఉంటే రూ.24 వేలు: నిజమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: 'ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం.. ఆడపిల్లలకు అద్భుతమైన పథకం. దీనికి దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వమే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తుంది..' అంటూ ఓ వార్త వాట్సాపులల్లో, ఫేస్బుక్లో తెగ చక్కర్లు కొడుతోంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే భయం అక్కర్లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉచితంగా డబ్బులు పంచుతారని దీని సారాంశం. ఎంతోమంది దీన్ని గుడ్డిగా నమ్ముతూ మిగతా గ్రూపులకు షేర్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకొమ్మని ఉచిత సలహా ఇస్తున్నారు. కానీ అసలు ఆ పథకమే లేనప్పుడు దేనికి దరఖాస్తు చేస్తారు? నిజానికి ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి ప్రభుత్వ పథకం లేదు. ఆ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా చెప్పనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అసత్యపు పథకాన్ని గురించి చాటింపు చేస్తుండటంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ వార్తను ఖండించింది. అవి ఫేక్ మేసేజ్‌లు అని, ఆ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఈసారి ఎవరైనా మీకు ఈ తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే నమ్మి మోసపోకండి. (కోవిడ్-19పై టాప్ ఫేక్ న్యూస్‌లు) తప్పుడు వార్త పేర్కొంటున్న అంశం: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన ద్వారా అన్ని రాష్ట్రాల్లో 5 నుంచి 18 ఏళ్ల ఆడపిల్ల ఖాతాల్లోకి ప్రతినెల రెండు వేలు అంటే సంవత్సరానికి 24 వేల రూపాయలు కేంద్రప్రభుత్వమే జమ చేస్తుంది. ఫ్యాక్ట్ చెక్: ఇది పూర్తిగా తప్పుడు వార్త. అసలు అలాంటి పథకమే లేదు. (బార్‌కోడ్‌తో చైనా వస్తువును గుర్తించొచ్చా?) -
బ్రాహ్మణ విద్యార్థులకు వరం..'భారతి విద్యా పథకం'
సాక్షి, తాడేపల్లి: పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో భారతి విద్యా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన విద్యార్థులు 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువు కొనసాగించేందుకు ఈ పథకం ద్వారా ఏటా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 2019–20 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హతలు వీరే.. విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి. విద్యార్థి పేరు తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. తల్లి, తండ్రి, సంరక్షకుడి వార్షిక ఆదాయం రూ.30 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యా సంస్థల్లో మాత్రమే చదువుతూ ఉండాలి. 2019–20 విద్యా సంవత్సరంలో పాఠశాల, కళాశాల, ఇన్స్టిట్యూట్, విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి. ఆయా కోర్సుల్లో ముందు సంవత్సరంలోని సబ్జెక్టులు అన్నీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఈ విధంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి పొంది ఉండకూడదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే. నగదు ప్రోత్సాహకాలు 1 నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తం రూ.5 వేలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.7 వేలు, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డీఎడ్, డీఫార్మసీ తదితర కోర్సులకు రూ.10 వేలు, డిగ్రీ కోర్సులకు రూ.15 వేలు, వృత్తి విద్యా కోర్సులకు రూ.20 వేలు, పీజీ కోర్సులకు రూ.10 వేలు ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థులకు పొదుపు ఖాతాలో జమ చేస్తారు. దరఖాస్తు చేయడం ఇలా.. అర్హులైన విద్యార్థులు వారి దరఖాస్తులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆంధ్రాబ్రాహ్మిణ్.ఏపీ.జీఓవీ.ఐఎన్ అనే వెబ్సైట్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులు 15 ఆగస్టు 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకు, ఇతర కోర్సులు చదివే విద్యార్థులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో..
భోపాల్ : డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ పెద్ద పధకమే రచించింది. గోధుమ పిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి వేల రూపాయలు అప్పనంగా కొట్టేయాలనుకుంది. కానీ, కథ అడ్డం తిరిగి నలుగురి ముందు నవ్వుల పాలైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా కైలరాస్‌కు చెందిన ఓ మహిళ ‘‘ఉదయ్ శ్రామిక్ సేవా సహాయత యోజన’’ క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16 వేలు ఇస్తారని తెలుసుకుంది. దీంతో భర్తతో కలిసి ఓ పధకం వేసింది. గోధుమపిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలాగా తయారుచేసి దానికి ఎరుపురంగు పూసింది. ఆ ముద్దమీద ఓ చిన్న గుడ్డముక్క కప్పి ఒళ్లోకి తీసుకుంది. అనంతరం ఏఎన్ఎమ్, ఆశా సిబ్బందితో కలిసి అంబులెన్స్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పిల్లల పేర్లు నమోదు చేసుకునే నర్సు వద్దకు చేరుకున్న మహిళ తన బిడ్డ పేరు రిజిస్టర్లో నమోదు చేయాలని కోరింది. బిడ్డని పరీక్ష చేసిన తర్వాతే పేరు నమోదు చేస్తానని నర్సు తెలిపింది. ఇందుకు ఆ మహిళ ఒప్పు కోలేదు. అప్పుడే పుట్టిన బిడ్డను ఇవ్వటం కుదరదని తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా మహిళ, ఆమె భర్త అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సిబ్బంది వారిని బయటకు పంపాలని చూడగా.. ‘‘సరైన సమయంలో వైద్యం అందుంటే నా బిడ్డ బ్రతికి ఉండేది’’ అని ఎరుపు రంగు పూసిన ముద్దను చూపిస్తూ మహిళ ఏడుపు లంఖించుకుంది. అయితే అది గోధుమ పిండితో తయారు చేసిన బొమ్మగా గుర్తించిన డాక్టర్లు షాక్ తిన్నారు. దీనిపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినోద్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ పధకం పారకపోయే సరికి వారు అక్కడినుంచి పరారయ్యారు. ప్రభుత్వ పథకం క్రింద సులభంగా డబ్బులు వస్తాయని వాళ్లను ఎవరో తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆమెకు తెలియదు. సీహెచ్‌సీ అధికారులతో చర్చింకున్న తర్వాత ఆ భార్యాభర్తలపై కేసు పెట్టకూడదని నిశ్చయించుకున్నాము. అలాచేస్తే మా పనికే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది’’ అని తెలిపారు. -
పాలనలో సీఎం స్పీడు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ఏపీ సీఏంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో స్పీడు పెంచారు. తొలిరోజు తొలిసంతకంతో పెన్షన్ మొత్తాలను భారీగా పెంచుతూ జీవో ఎంఎస్ నంబర్ 103 జారీచేసిన సీఎం ప్రభుత్వ పథకాలను సమర్దవంతంగా అమలు చేసేందుకు అధికారుల బదిలీలకు దిగారు. జిల్లా స్థాయిలో ముఖ్యమైన అధికారుల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందుకోసం సీఎం రెండు రోజులుగా ఉన్నతాధికారులతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులలోనే అన్ని శాఖల అధికారుల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. అవినీతికి తావులేని సమర్ధులైనఅధికారుల ఎంపిక వారికి బాధ్యతలు అప్పగించేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డయాలసిస్ బాధితులకు చేయూత.. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం తొలి జీవో జారీ చేసింది. వృద్ధులతో పాటు వికలాంగులు, చేనేత, వితంతు, ఒంటరి మహిళల, మత్స్యకారులతో పాటు కిడ్నీ వ్యాధులకు సంబంధించి డయాలసిస్ పేషెంట్ల పెన్షన్లను భారీగా పెంచారు. మొత్తంగా రూ. 2 వేలు ఉన్న ఎనిమిది రకాల పెన్షన్లను రూ. 2,250 కి పెంచగా వికలాంగులకు సంబంధించిన అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం రూ.3 వేలు చేసింది. డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పింఛను ఇప్పటి వరకూ రూ.3500 మాత్రమే ఉండగా దానిని రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేయడం గమనార్హం. దీని వల్ల జిల్లాలోని 3,80,903 మంది పెన్షన్‌దారులు లబ్ది పొందనున్నారు. ఈ పెరిగిన పింఛన్లు అన్నీ జూలై నెల నుంచి అందుతాయి. ఇక పెన్షన్ వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు లభించనున్నాయి. ఇక ఆగస్టు15 నాటికే గ్రామస్థాయిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌తో పాటు అక్టోబర్–2 నాటికి గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయంలో పది మందికి చొప్పున ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీనివల్ల ఒక్క ప్రకాశం జిల్లాలోనే దాదాపు 40 వేలమందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు.. ఎన్నికలలో చెప్పిన నవరత్నాలు పథకాలతో పాటు అన్ని రకాల పథకాలను అవినీతికి తావులేకుండా సమర్ధవంతగా అమలు చేసేందుకు జగన్ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సమర్దులైన అధికారులను నియమించేందుకు సీఎం కసరత్తు వేగవంతం చేశారు. చంద్రబాబు సర్కార్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను తప్పించి సమర్దవంతమైన అధికారులను నియమించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు, వారి పనితీరుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది. రెండు మూడు రోజుల్లోనే జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తంగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే సీఎం జగన్ పాలనలో స్వీడు పెంచారు. ఆయన తీరును గమనిస్తున్న జనం సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని, సమర్ధవంతమై పాలను అందిస్తారని నమ్మకంతో ఉన్నారు. -
ఆధార్‌తో రూ. 90వేల కోట్ల ఆదా..
న్యూఢిల్లీ: అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్‌తో గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు రూ. 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు. ‘ఆధార్ ప్రయోజనాలు’ అంశంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆధార్ వినియోగం ద్వారా భారత్ ఏటా రూ. 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ‘ఆధార్‌తో ఆదా అయ్యే నిధులతో ఆయుష్మాన్ భారత్ స్థాయిలో మూడు పథకాలను అమలు చేయొచ్చు’ అని జైట్లీ తెలిపారు. కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీనిచ్చే ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద.. దాదాపు 10.74 కోట్ల పైగా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 7 లక్షల మంది పేద పేషెంట్లు.. ఉచిత వైద్య చికిత్స పొందినట్లు జైట్లీ పేర్కొన్నారు. 122 కోట్ల ఆధార్ నంబర్ల జారీ.. 2016లో ఆధార్ బిల్లును జారీ చేసినప్పట్నుంచీ 28 నెలల వ్యవధిలో 122 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేయడం జరిగిందని జైట్లీ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వయోజనుల్లో 99 శాతం మందికి ఆధార్ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఆధార్ ఆధారంగా ఇప్పటిదాకా లబ్ధిదారులకు బదలాయించిన సబ్సిడీల విలువ దాదాపు రూ. 1,69,868 కోట్ల మేర ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోవడం వల్ల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయి. ఇది భారత్‌లో మాత్రమే అమలవుతున్న ప్రత్యేక టెక్నాలజీ’ అని వివరించారు. -
లైంగిక దాడులకు పాల్పడితే ప్రోత్సాహకాలు కట్
చిత్తూరు ,కలెక్టరేట్: చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించడంతోపాటు జీవితాంతం ప్రభుత్వ పథకాలు, రాయితీలను నిలిపి వేస్తామని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు, మహిళలను హింసించడం లాంటి సంఘటనలపై తక్షణం స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్, డీఆర్డీఏ శా ఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నెలకోసారి సమావేశం నిర్వహించి మహిళల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరిగితే 164 చట్టం ప్రకారం 24 గంటలలోపు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో కరపత్రాలు, ర్యాలీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డీఆర్ఓ గంగాధరగౌడ్, ఏఎస్పీ రాధిక, ఆర్డీఓ కోదండరామిరెడ్డి, మదనపల్లె ఇన్చార్జ్ సబ్‌కలెక్టర్ గుణభూషణ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రహసనంగా ప్రణాళికలు
♦ లక్ష్యాలు బారెడు... ఇచ్చేది మూరెడు ♦ ప్రభుత్వ పథకాలకు ముఖం చాటేస్తున్న ♦ బ్యాంకర్లు శాఖల మధ్య సమన్వయలోపం ♦ కొరవడిన పర్యవేక్షణ ♦ వార్షిక రుణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం సాక్షి, విశాఖపట్నం: జిల్లా యంత్రాంగం ప్రకటించే వార్షిక రుణ ప్రణాళికలు ప్రహసనంగా మారుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు గాలికొదిలేస్తున్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ ప్రకటనలో జాప్యం.. లబ్ధిదారుల ఎంపికలో శాఖలు చూపించే అలసత్వం.. సబ్సిడీ మొత్తం విడుదలలో ప్రభుత్వం చేసే అలక్ష్యం...అన్నింటి కంటే ముఖ్యంగా బ్యాంకుల నిరాసక్తత లక్ష్యాలను నీరుగారుస్తున్నాయి. కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా బ్యాంకర్లైపై చర్యలు తీసుకునే సాహసం జిల్లా యంత్రాంగం ఏనాడు చేయలేకపోతోంది. దీంతో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. పొంతనలేని కేటాయింపులు: 2014-15లో ఏకంగారూ.7260 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను నిర్దేశిస్తే.. రూ.4895 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1653 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.886 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.5377 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.2197కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1883 కోట్లకు రూ.2699 కోట్ల మేర ఇవ్వగలిగారు. హుద్‌హుద్ దెబ్బతో ఆ ఏడాది దాదాపు అన్ని రంగాలు కుదేలవడంతో లక్ష్యాలను చేరుకోలేక పోయాయని సరిపెట్టుకోవచ్చు. కాని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.8198 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తే రూ.7880 కోట్ల మేర ఇవ్వగలిగారు. 95 శాతం మేర రుణాలు ఇవ్వగలిగినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలకు మాత్రం లక్ష్యాలకు ఆమడ దూరంలోనే రుణాలివ్వగలిగారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ, అనుబంధ రంగాలు.. వివిధ శాఖలకు ఇవ్వలేదు ఒక్క పంట రుణాలు మినహా.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేనికి లక్ష్యం మేరకు రుణాలివ్వలేదు. వీటితో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, బ్యాంకర్లు నిర్లక్ష్యాన్నే ప్రదర్శించాయి. ఆయా శాఖలకు నిర్దేశించిన యూనిట్లకు కాస్త ఆలశ్యమైనా చాలా వరకు సబ్సిడీ మొత్తాలు విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు నిరాసక్తతనే ప్రదర్శించాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు రూ.2,150కోట్లు లక్ష్యం కాగా.. రూ.1852 కోట్లు ఇవ్వగలిగారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.75 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా కేవలం రూ.2.87కోట్లు, డెయిరీ యూనిట్లకు రూ.137 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17.30 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక మిగిలిన వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఇదే రీతిలో అరకొరగానే రుణాలు ఇచ్చారు. సంక్షేమ శాఖలదీ అదే తీరు సంక్షేమ శాఖల విషయానికొస్తే ఎస్సీ సంక్షేమ శాఖ కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ పోను రూ.17.92 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4.11కోట్లు ఇవ్వగలిగారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో కూడా లక్ష్యంలో 50 శాతానికి మించి రుణాలివ్వలేకపోయారు. కానీ ప్రాధాన్యేతర రంగాలకు రూ.2448 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా.. ఏకంగా రూ.3483 కోట్లు ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా. ఏకంగా రూ.1612కోట్లు ఇవ్వగలిగారు. ఇక 2016-17లో ఎప్పటిలాగే 26 శాతం హెచ్చుతో ఏకంగా రూ.10,340 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రెండ్రోజుల క్రితం జిల్లా కలెక్టర్ యువరాజ్ విడుదల చేశారు. ఈసారి లక్ష్యాల మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై క్రిమినల్ కేసులు పెడతానని ఘాటుగానే హెచ్చరించారు. ఈహెచ్చరికలు ఏమేరకు సత్పలితాలనిస్తాయో వేచిచూడాల్సిందే. -
6నెలల్లో 85సార్లు జన్మనిచ్చిందట!
గౌహతి: అవకాశం రావాలే గానీ గుడినీ, గుళ్లో లింగాన్ని మింగేసే ప్రబుద్ధులు చాలామందే ఉంటారు. అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునే మహిళలకు ప్రోత్సహం కింద ఇచ్చే ప్రభుత్వ పథకాన్ని సొమ్ము చేసుకోవాలని చూసిన ఓ ప్రభుత్వ ఆసుపత్రి నర్సు అడ్డంగా బుక్కయింది. వివరాల్లోకి వెళితే ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలల్లో పురుడు పోసుకునే తల్లులకు ఇచ్చే డబ్బులపై కన్నేసిన ఆసుపత్రి నర్సు లిల్లీ బేగం అవినీతికి పాల్పడింది. కరీంగంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరునెలల కాలంలో సుమారు 160 ప్రసవాలు అయినట్టుగా ఆసుపత్రి రికార్డులో చూపించిన లిల్లీ బేగం వీటిలో సగానికి పైగా కేసులను తన పేరుతో నమోదు చేసింది. అంతేకాకుండా ఏకంగా తాను 85 సార్లు బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించింది. తద్వారా 40,000 రూపాయలను దక్కించుకుంది. అయితే ఈ ప్రసవాలను నమోదు చేసే అధికారం తన చేతిలోనే ఉండటంతో లిల్లీ బేగం పని మరింత సులువయింది. ఈ ఉదంతంపై అందిన ఫిర్యాదుతో మేల్కొన్న ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో లిల్లీ బేగం బండారం బయటపడింది. అవినీతి జరిగినట్టు తమ విచారణలో తేలినందున ఆమెను విధులనుంచి తొలగించినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి సర్ఫరాజ్ ప్రకటించారు. 'నర్సులుగా మేం చాలా చాకిరీ చేస్తాం.. మా పనికి తగ్గ వేతనాలు లభించడంలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. తప్పు చేశానంటూ లిల్లీ క్షమాణలు కోరింది. -
‘పచ్చని’ చదువుకు పాతర
సాక్షి, కర్నూలు: పథకం ఉద్దేశం మంచిదే అయినా.. అమలులో చిత్తుశుద్ధి లోపిస్తోంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించే పథకం ఏదీ అనుకున్న స్థాయిలో ముందుకు సాగని పరిస్థితి. ప్రారంభంలో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత నిధుల విడుదలలో కోత విధిస్తుండటంతో మొదటికే మోసం వస్తోంది. ఈ కోవకు చెందినదే గ్రీన్‌కోర్. విద్య బతకడం నేర్పాలి. తనచుట్టూ ఉన్న వారిని బతికించేందుకు తోడ్పడాలి. సామాజిక రుగ్మతలపై ఎడతెగని పోరాటం చేసే.. సమజ క్షేమాన్ని కాంక్షించే గుణం అలవర్చాలి. అప్పుడే ఆ జ్ఞానానికి సార్థకత. ఇలాంటి సుగుణాలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో గ్రీన్‌కోర్ పథకానికి ప్రభుత్వం పదేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచే పచ్చదనం.. పర్యావరణ పరిరక్షణ.. పరిశుభ్రత ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజెప్పి చక్కటి సమాజాన్ని నిర్మించాలనే పథకం ఉద్దేశం ఇటీవల కాలంలో నీరుగారుతోంది. జిల్లాలోని 54 మండలాల్లో 501 ఉన్నత పాఠశాలలు ఉండగా.. నిధుల లేమితో పథకం కొడిగట్టింది. పథకంలో భాగంగా 8 నుంచి 10వ తరగతి వరకు ఎంపిక చేసిన విద్యార్థులతో నీరు, శుభ్రత, విద్యుత్, మొక్కలు, స్థల సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సమన్వయకర్తగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లేదా సైన్స్ ఉపాధ్యాయుడు, అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు. నిర్వహణకు రూ.2,500 చొప్పున ఆయా పాఠశాలల ఖాతాలో నిధులు జమచేస్తారు. ఈ మొత్తంలో రూ.500 సంఘం నిర్వహణకు, సేంద్రియ ఎరువుల తయారీకి రూ.1000, మిగిలిన సొమ్ము సంఘంలోని విద్యార్థుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 250 ఉన్నత పాఠశాలల్లో పథకం అమలుకు అనుమతులు మంజూరయ్యాయి. మొదట్లో అన్ని పాఠశాలలకు నిధులు మంజూరైనా.. నిధుల దుర్వినియోగం సాకుతో ఏడాదికి 50 పాఠశాలలకే నిధులను పరిమితం చేశారు. 2008-09 నుంచి ఆసక్తి గల పాఠశాలలు ప్రతిపాదనలు పంపితేనే నిధులు మంజూరు చేయడం జరుగుతోంది. ఈవిధంగా 2010-11 సంవత్సరానికి 50 ఉన్నత పాఠశాలలకు రూ. 1.25 లక్షలు మంజూరయ్యాయి. వీటన్నింటినీ ఆయా పాఠశాలలు ఖర్చు చేశాయి. అయితే ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు లేకపోవడం గమనార్హం. ఇక 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఇప్పటి వరకు నిధులే మంజూరు చేయకపోవడం పథకం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇందుకు సంబంధించిన నిధులను హైదరాబాద్‌లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు నిర్వహణకు మళ్లించినట్లు సమాచారం. గ్రీన్‌కోర్ సంఘాలు.. పనితీరు మొక్కల సంఘం: మొక్కలు నాటించి వృథా నీటిని మళ్లించడం. వర్షం నీటిని నిలువ చేసి భూగర్భ జలాలను, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం. శుభ్రత సంఘం: చెట్ల పైనుంచి రాలిన ఆకులతో వర్మీ కంపోస్టును తయారు చేయడం. పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వడం. నీటి సంఘం: నీటి వృథాను అరికట్టి పొదుపు చేయడం. అవసరాలకు వాడిని నీటిని మొక్కల పెంపకానికి మళ్లించడం. మంచినీటి ట్యాంకుల శుభ్రం, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించడం. విద్యుత్ సంఘం: వీలైనంత వరకు గాలి, వెలుతురును వాడుకొంటూ విద్యుత్ చార్జీలను తగ్గించడం. వనరుల సమర్థ సద్వినియోగాన్ని విద్యార్థులకు అలవర్చడం. స్థల సంఘం: విద్యార్థుల సైకిళ్లను ఒకేచోట నిలిపేలా చూడటం. మొక్కల పెంపకంతో పాటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం. వృథా స్థలాన్ని క్రీడలకు వినియోగించడం. -
కొరడా ఝుళిపిస్తున్న కలెక్టర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడా నికి, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని పెంచడానికి కొత్త కలెక్టర్ శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారంలోనూ రాజీ పడబోనని, విధులను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని తనిఖీల ద్వారా స్పష్టం చేశారు. మా చారెడ్డి బీసీ హాస్టల్ వార్డెన్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు దృష్టికి రాగానే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్, నిజాంసాగర్ మండలాలలో అధికారుల పని విధానంపై ఆరా తీశారు. నిజాంసాగర్ తహశీల్దార్ వద్ద సమగ్ర సమాచారం లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట ఇటువంటి పరిస్థితి ఉండ కూడదని హెచ్చరించారు. అచ్చంపేటలోని యునానీ ఆస్పత్రిలో విధులకు డుమ్మా కొడుతున్న హెచ్ఈఓను సస్పెండ్ చేశారు. ఈ రెండు మండలాలలోని ఆస్పత్రులు, హా స్టళ్లను తనిఖీ చేశారు. నిజామాబాద్ నుంచి బయలుదేరిన కలెక్టర్ నగరంలోని పూలాంగ్ వద్ద రోడ్లను పరిశీలించారు. పులాంగ్‌వాగు స్థలాన్ని కబ్జా చేయటం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉధృతి ఏర్పడి ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది.ఈ విషయం కలెక్టర్ నోటీసు లో ఉండటంతోనే జుక్కల్‌కు వెళ్తూ ఈ రోడ్డును పరిశీలిం చినట్టు తెలుస్తోం ది. భూకబ్జాలపై ఉక్కుపా దం మోపుతారని ప్రద్యుమ్నకు పేరుంది. దీంతో ఆక్రమణ దారుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. నగరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలుచోట్ల భూకబ్జాలకు పాల్పడిన వారు కొత్త కలెక్టర్ వ్యవహారశైలితో జంకుతున్నారు. వీకెండ్ మీటింగ్ రద్దు.. గతంలో పనిచేసిన కలెక్టర్లు ప్రతి శనివారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించేవారు. ఈ సంప్రదాయాన్ని ప్రద్యుమ్న రద్దు చేసినట్లు తెలి సింది. వరప్రసాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలం నుంచి ఈ వీకెండ్ మీటింగ్‌లు జరుగుతున్నా యి. అయినప్పటికీ జిల్లా అధికారులు, ఉద్యోగుల పనితీరులో పెద్ద గా మార్పు కనిపించలేదని చెప్పవచ్చు. గత కలెక్టర్ క్రిస్టీనా మాత్రం అధికారులు, ఉద్యోగులలో జవాబుదారీతనంతోపాటు పారదర్శకతను పెంచటానికి ప్రయత్నించారు. కలె క్టరేట్‌లో కొంతమంది అధికారులు, ఉద్యోగులతో కలిసి కోటరీని ఏర్పాటుచేసుకుని యథేచ్ఛగా తన కార్యకలాపాలను సాగిస్తున్న ఒక ఉన్నతాధికారి చర్యలను మాత్రం ఆమె పూర్తి స్థాయిలో నివారించలేకపోయారన్న అభిప్రాయం ఏర్పడింది. దీనికి కొత్త కలెక్టర్ చెక్ పెట్టగలరా అన్న చర్చ సాగుతోంది. జిల్లాలో భూకబ్జాలతో పాటు ఇసు క మాఫియా ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపైనా ప్రద్యుమ్న దృష్టి సారించా లని ప్రజలు కోరుతున్నారు. కోటరీ నడిపిస్తున్న ఉన్నతాధికారే ఈ మాఫియాకు ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారా లు అందించినట్లు ఆరోపణలు లేకపోలేదు. జవాబుదారీతనంపై దృష్టి.. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించే దిశగా కలెక్టర్ ప్రద్యుమ్న ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, రెవెన్యూ, పౌరస రఫరాల శాఖలతో పాటు ఆసుపత్రుల పనితీరుపై ఆయన సీరియస్‌గాా ఉన్నారు. పని చేసేచోటే అధికారులు, ఉద్యోగులు నివాసం ఉండాలనే విషయంపై కలెక్టర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు స్థానికంగా ఉంటే పథకాల అమలు, కార్యక్రమాల ప్రగతి బాగుంటుందని కలెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. పీహెచ్‌సీలతో పాటు ఏరియా, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ, జిల్లాకేంద్ర ఆస్పత్రులలో డాక్టర్ల పనితీరు మెరుగ్గా లేదని, ముఖ్యంగా స్థానికంగా ఉండటం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగు లు స్థానికంగా ఉండకుండా హైద్రాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే స్థాని కంగా నివాసముండని అధికారులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ చేపట్టనున్న చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కలెక్టరేట్ : అధికారుల స్థాయిలో తీరని సమ్య లు ఏమైనా ఉన్నాయా! ఫర్వాలేదు.. నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ బాధలను చెప్పుకోవచ్చు! కొత్తగా బాధ్యతలు స్వీకరిం చిన ప్రద్యుమ్న ఈ అవకాశాన్ని జిల్లా ప్రజ లకు కల్పించారు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెం బర్ 18004256644 అందుబాటులో ఉంచా రు. తప్పదనుకుంటే కలెక్టర్ సెల్ నంబర్ 9491036933 కూ ఫోన్ చేయొచ్చు! ఈ మేర కు ప్రద్యుమ్న జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ప్రగతి భవన్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో జిల్లా అధికారులు మాత్రమే హాజరై ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. ముందస్తు స మాచారం లేకుండా కింది స్థాయి సిబ్బం దిని ప్రజావాణికి పంపకూడదన్నారు.ప్రజావాణి లో స్వీకరించే అర్జీలను 15 రోజులలోగా పరి ష్కరించి ఆన్లైన్లో ఉంచాలన్నారు. -
బంగారుతల్లికి 52 వేల దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగారుతల్లి పథకం కోసం మొత్తం 51,925 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ కూడా ఉండాలని, వచ్చే ఏడాది నుంచి ఆధార్ ఉన్నవారే పథకానికి అర్హులని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. పింఛన్ల లబ్ధిదారులను గుర్తించామని, త్వరలో జరిగే రచ్చబండలో వారికి పింఛన్లు అందిస్తామని ఆమె వివరించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్‌ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు.