సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జలవిహార్ లో జరిగిన మైనార్టీనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘ మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ సన్మానించారు.
మంత్రి హరీశ్ మాట్లాడుతూ... మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్. హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు. మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. కాంగ్రేస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి.
(చదవండి: బర్త్, స్టడీ సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు)
దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే. ఈ బడ్జెట్ లో మీ సంక్షేమం కోసం 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినం. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉంది.
రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నాం. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మయి నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది. ముస్లింల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
(చంద్రబాబు వారసుడు రేవంత్)
Comments
Please login to add a commentAdd a comment