సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడా నికి, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని పెంచడానికి కొత్త కలెక్టర్ శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారంలోనూ రాజీ పడబోనని, విధులను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని తనిఖీల ద్వారా స్పష్టం చేశారు. మా చారెడ్డి బీసీ హాస్టల్ వార్డెన్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు దృష్టికి రాగానే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్, నిజాంసాగర్ మండలాలలో అధికారుల పని విధానంపై ఆరా తీశారు. నిజాంసాగర్ తహశీల్దార్ వద్ద సమగ్ర సమాచారం లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట ఇటువంటి పరిస్థితి ఉండ కూడదని హెచ్చరించారు. అచ్చంపేటలోని యునానీ ఆస్పత్రిలో విధులకు డుమ్మా కొడుతున్న హెచ్‌ఈఓను సస్పెండ్ చేశారు. ఈ రెండు మండలాలలోని ఆస్పత్రులు, హా స్టళ్లను తనిఖీ చేశారు.
నిజామాబాద్ నుంచి బయలుదేరిన కలెక్టర్ నగరంలోని పూలాంగ్ వద్ద రోడ్లను పరిశీలించారు. పులాంగ్‌వాగు స్థలాన్ని కబ్జా చేయటం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉధృతి ఏర్పడి ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది.ఈ విషయం కలెక్టర్ నోటీసు లో ఉండటంతోనే జుక్కల్‌కు వెళ్తూ ఈ రోడ్డును పరిశీలిం చినట్టు తెలుస్తోం ది. భూకబ్జాలపై ఉక్కుపా దం మోపుతారని ప్రద్యుమ్నకు పేరుంది. దీంతో ఆక్రమణ దారుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. నగరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలుచోట్ల భూకబ్జాలకు పాల్పడిన వారు కొత్త కలెక్టర్ వ్యవహారశైలితో జంకుతున్నారు.
వీకెండ్ మీటింగ్ రద్దు..
గతంలో పనిచేసిన కలెక్టర్లు ప్రతి శనివారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించేవారు. ఈ సంప్రదాయాన్ని ప్రద్యుమ్న రద్దు చేసినట్లు తెలి సింది. వరప్రసాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలం నుంచి ఈ వీకెండ్ మీటింగ్‌లు జరుగుతున్నా యి. అయినప్పటికీ జిల్లా అధికారులు, ఉద్యోగుల పనితీరులో పెద్ద గా మార్పు కనిపించలేదని చెప్పవచ్చు. గత కలెక్టర్ క్రిస్టీనా మాత్రం అధికారులు, ఉద్యోగులలో జవాబుదారీతనంతోపాటు పారదర్శకతను పెంచటానికి ప్రయత్నించారు. కలె క్టరేట్‌లో కొంతమంది అధికారులు, ఉద్యోగులతో కలిసి కోటరీని ఏర్పాటుచేసుకుని యథేచ్ఛగా తన కార్యకలాపాలను సాగిస్తున్న ఒక ఉన్నతాధికారి చర్యలను మాత్రం ఆమె పూర్తి స్థాయిలో నివారించలేకపోయారన్న అభిప్రాయం ఏర్పడింది. దీనికి కొత్త కలెక్టర్ చెక్ పెట్టగలరా అన్న చర్చ సాగుతోంది. జిల్లాలో భూకబ్జాలతో పాటు ఇసు క మాఫియా ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపైనా ప్రద్యుమ్న దృష్టి సారించా లని ప్రజలు కోరుతున్నారు. కోటరీ నడిపిస్తున్న ఉన్నతాధికారే ఈ మాఫియాకు ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారా లు అందించినట్లు ఆరోపణలు లేకపోలేదు.
జవాబుదారీతనంపై దృష్టి..
ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించే దిశగా కలెక్టర్ ప్రద్యుమ్న ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, రెవెన్యూ, పౌరస రఫరాల శాఖలతో పాటు ఆసుపత్రుల పనితీరుపై ఆయన సీరియస్‌గాా ఉన్నారు. పని చేసేచోటే అధికారులు, ఉద్యోగులు నివాసం ఉండాలనే విషయంపై కలెక్టర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు స్థానికంగా ఉంటే పథకాల అమలు, కార్యక్రమాల ప్రగతి బాగుంటుందని కలెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. పీహెచ్‌సీలతో పాటు ఏరియా, అర్బన్ హెల్త్ సెంటర్‌లు, కమ్యూనిటీ, జిల్లాకేంద్ర ఆస్పత్రులలో డాక్టర్ల పనితీరు మెరుగ్గా లేదని, ముఖ్యంగా స్థానికంగా ఉండటం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగు లు స్థానికంగా ఉండకుండా హైద్రాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే స్థాని కంగా నివాసముండని అధికారులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ చేపట్టనున్న చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కలెక్టరేట్ : అధికారుల స్థాయిలో తీరని సమ్య లు ఏమైనా ఉన్నాయా! ఫర్వాలేదు.. నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ బాధలను చెప్పుకోవచ్చు! కొత్తగా బాధ్యతలు స్వీకరిం చిన ప్రద్యుమ్న ఈ అవకాశాన్ని జిల్లా ప్రజ లకు కల్పించారు. కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెం బర్ 18004256644 అందుబాటులో ఉంచా రు. తప్పదనుకుంటే కలెక్టర్ సెల్ నంబర్ 9491036933 కూ ఫోన్ చేయొచ్చు! ఈ మేర కు ప్రద్యుమ్న జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ప్రగతి భవన్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో జిల్లా అధికారులు మాత్రమే హాజరై ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. ముందస్తు స మాచారం లేకుండా కింది స్థాయి సిబ్బం దిని ప్రజావాణికి పంపకూడదన్నారు.ప్రజావాణి లో స్వీకరించే అర్జీలను 15 రోజులలోగా పరి ష్కరించి ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు.
కొరడా ఝుళిపిస్తున్న కలెక్టర్
Published Sun, Sep 1 2013 2:38 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement