తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా | 12 year old dies in freak shooting by cousin | Sakshi
Sakshi News home page

తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా

Published Tue, Jul 29 2014 1:04 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా - Sakshi

తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా

ఫిరోజాబాద్: అన్నయ్య సరదా తమ్ముడి ప్రాణం తీసింది. సోదరుడి చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది. రామ్గఢ్ ప్రాంతంలోని రాపూరాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మూడో తరగతి చదువుతున్న పంకజ్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసివున్న తుపాకీని పంకజ్ సోదరుడు యశ్వంత్ సింగ్ సరదా పేల్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ఛాతిలో దిగడంతో పంకజ్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తుపాకీ అక్రమమైందని చెప్పారు. యశ్వంత్ సింగ్ పై 304 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement