ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది!
ఎండలు పెట్రేగుతున్నాయి. ఎన్నడులేని రీతిలో దంచి కొడుతున్నాయి. అడవి ఎండిపోతున్నది. కుంటలు, చెరువులు, గుంతుల్లో నీరు ఆవిరవుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నీటి జాడను వెతుక్కుంటూ ఓ మొసలి ఊరిలోకి జనాలను హడలెత్తించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలోని రసాని గ్రామంలో జరిగింది.
గ్రామంలోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన మొసలి గురించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఒడుపుగా మొసలిని బంధించారు. ఈ ఉభయచరాన్ని జాతీయ చంబల్ జంతు సంక్షరణ కేంద్రంలోని చంబా నదిలో వదిలివేయనున్నట్టు వారు తెలిపారు.
WATCH:Crocodile enters residential area in Firozabad's Darapur Raseni village(UP),later captured by forest officialshttps://t.co/ol38NIoLK7
— ANI (@ANI_news) 22 April 2016
గోవా బీచ్లో ఓ మొసలి కనిపించడం.. దాని ఫొటోలు ఆన్లైన్లో వైరల్ కావడం తెలిసిందే. నది పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే మొసళ్లు ఈ మధ్య జనావాసాల్లోకి కూడా వస్తుండటం అలజడి రేపుతున్నది. ఎండలు పెరిగిపోవడం.. నీటికుంటలు తరిగిపోతుండటంతో ఆవాస ప్రాంతాలు లేక ఇలా మొసళ్లు అవస్థ పడుతున్నాయని జంతు ప్రేమికులు అంటున్నారు.