భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో భువనగిరి సబ్జైలు ప్రహారీ గోడ శనివారం తెల్లవారుజామున కూలి పోయింది.
భారీ వర్షాలుఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో భువనగిరి సబ్జైలు ప్రహారీ గోడ శనివారం తెల్లవారుజామున కూలి పోయింది. ఆ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని జైలు అధికారులు వెల్లడించారు. అయితే జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితిపాముల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో చేరువులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. చేరువులోని నీరు నకిరేకల్ జాతీయ రహదారిపైకి వచ్చి చేరింది.
దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అలాగే మేళ్ల చెరువు మండలం నెమలిపురి, అడ్లూరు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. దాంతో అయా గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. జిల్లాలోని మోత్కూరు పాత బస్టాండ్ను వరద నీరు ముంచెత్తింది. ఆత్మకూరు (ఎం)లో వరద నీరు భారీ వచ్చి చేరింది. దాంతో వరద నీరు రోడ్డుపై వచ్చి ప్రవహిస్తుంది. దీంతో మోత్కూరు, భువనగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి.
భారీ వర్షాల కారణంగా బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దాంతో రేపల్లి ఎక్స్ప్రెస్ రైలు శనివారం నిలిచిపోయింది. అలాగే పలురైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు ప్రారంభించారు.