Bhuvanagiri sub jail
-
'సీఎం మాటలకూ విలువ లేదు'
-
'సీఎం మాటలకూ విలువ లేదు'
భువనగిరి: ఉద్యోగానికి వెళ్తున్నానంటూ గతరాత్రి అదృశ్యమైన భువనగిరి సబ్‌జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు బుధవారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీనివాసరావు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు. ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: సబ్‌జైలు సూపరిండెంటెంట్ అదృశ్యం) బుధవారం ఉదయం ఇంటికి చేరుకోకపోవడంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో గదిలో శ్రీనివాస్ రాసిన లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు లేఖలో తెలిపాడు. జైళ్ల శాఖలో ఉన్నతాధికారి చెప్పిందే వేదమని, సీఎం మాటలకు కూడా విలువ లేదని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నాడు. -
భువనగిరి సబ్‌జైలు సూపరిండెంటెంట్ అదృశ్యం
భువనగిరి : నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ శ్రీనివాస్ మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు. ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో శ్రీనివాస్ గదిలో ఆయన రాసిన లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్ అదృశ్యంపై అతడి కుటుంబ సభ్యులు భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భువనగిరి సబ్‌జైలు సూపరిండెంటెంట్ అదృశ్యం
-
నల్గొండలో భారీ వర్షాలు: కూలిన భువనగిరి సబ్ జైలు గోడ
భారీ వర్షాలుఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో భువనగిరి సబ్‌జైలు ప్రహారీ గోడ శనివారం తెల్లవారుజామున కూలి పోయింది. ఆ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని జైలు అధికారులు వెల్లడించారు. అయితే జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితిపాముల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో చేరువులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. చేరువులోని నీరు నకిరేకల్ జాతీయ రహదారిపైకి వచ్చి చేరింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అలాగే మేళ్ల చెరువు మండలం నెమలిపురి, అడ్లూరు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. దాంతో అయా గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. జిల్లాలోని మోత్కూరు పాత బస్టాండ్‌ను వరద నీరు ముంచెత్తింది. ఆత్మకూరు (ఎం)లో వరద నీరు భారీ వచ్చి చేరింది. దాంతో వరద నీరు రోడ్డుపై వచ్చి ప్రవహిస్తుంది. దీంతో మోత్కూరు, భువనగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దాంతో రేపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం నిలిచిపోయింది. అలాగే పలురైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు ప్రారంభించారు.