కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమల్లెపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. గ్రామానికి చెందిన ఎర్రస్వామి(25), రామాంజినమ్మ(20) దంపతులు తమ కుమార్తె శ్వేత(5)తో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. అర్థరాత్రి సమయంలో వారు నిద్రిస్తున్న చోట ఉన్న పాత గోడ కూలి వారిపై పడింది.
ఈ ఘటనలో రామాంజినమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శ్వేత అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. కాగా, స్వల్పంగా గాయపడిన ఎర్రస్వామి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.