భీమవరం : స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి దిరుసుమర్రులోని జెడ్పీ స్కూల్ గోడను ఢీకొట్టింది. దీంతో ఆర్చ్ కూలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.