అధైర్యపడకండి.. అండగా ఉంటాం
ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు: చెన్నైలో గత నెల 28న నిర్మాణంలో ఉన్న బహుళ అంత స్తుల భవనం కూలిన ఘట నలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఎల్‌ఎన్ పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో బాధిత కుటుంబాలను ఆది వారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం రూ.25 వేలు ఇంకా ఇవ్వలేదని బాధితులు ఎమ్మెల్యేకు చెప్పారు. సాయం అందేందుకు సీఎంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, ఎమ్మెల్యే కోటా నుంచి ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయాలను అందేలా కృషి చేస్తామని రెడ్డి శాంతి అన్నారు. అందవరపు అబ్బాయి, శివ్వాల కిశోర్, లుకలాపు రాజారావు, ముగడ జనార్థనరావు, కొమరాపు తిరుపతిరావు, కె.చిరంజీవి, పి.ఆదినారాయణ, గేదెల జగన్మోహనరావు, శిమ్మ సాంబశివరావు, కిలారి త్రినాథరావు, యారబాటి రామకృష్ణ, కొల్ల రాము, ఎర్ర జనార్థనరావు, ముగడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వలసలు నివారించి ఉపాధి కల్పించండి...
హిరమండలం మండలంలోని గొట్ట,లక్ష్మీపురంకు చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, రెడ్డిశాంతి పరామర్శించారు.ఈ దుర్ఘటనలో భర్త శ్రీను, కుమార్తె భవానీలను కోల్పోయిన మీసాల వరలక్ష్మిని పరామర్శించారు. పల్లెల్లో వలసలు నివారించి గ్రామీణులకు ఉపాధి వనరులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జెడ్పీటీ సీ ప్రతినిధి, సర్పంచ్ లోలుగు.లక్ష్మణరావు, ఎ.అబ్బాయి, ఎ.వి సురేష్, గేదెల.జగన్మోహనరావు, టి.రమేష్ ఉన్నారు.
రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి...
చెన్నై ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. కొత్తూరు మండలంలోని ఇరపాడుకు చెందిన అన్నదమ్ములు అమాలపురం శ్రీనివాసరావు(రమేష్), రాజేష్, కిమిడి సుబ్బారావులు కుటుంబాలను ఆదివారం రెడ్డిశాంతి, ఎంఎల్‌ఏ కలమట వెంకటరమణలు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు సూర్యారావు, రమణమ్మ, దశాలుమ్మలను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రకటించిన రూ. 25 వేలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఏ. అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ మండల పార్టీ కన్వీనర్ పొత్రకొండ మోహన్‌రావు, సర్పంచ్ బర్రి గోవిందరావు, మాజీ ఉప సర్పంచ్ జి. భానుమూర్తి, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు బూర్లె శ్రీనివాసరావు, పోర్న గోవింద, మునకోటి సీతారాం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ గొంటి రమేష్, గంగరాజు, సింహచలం తదితరులు పాల్గొన్నారు.