సీఎస్‌పురం: వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని చదును చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన మారంరెడ్డి రత్నారెడ్డికి అర ఎకరా పొలం ఉంది. అందులో వరి సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. చదును చేసేందుకు పాకుమాను వేయాల్సి వచ్చింది. ఎద్దులు లేకపోవడం, ట్రాక్టర్ యజమానులు బాడుగ ఎక్కువగా చెబుతుండటంతో ఏం చేయలో అర్థం కాలేదు.
పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన అన్న కుమారులు మారంరెడ్డి రమణారెడ్డి, మోహన్‌రెడ్డిలను కాడి లాగేందుకు ఉపయోగిస్తూ తాను వెనుక ఉండి పాకుమానుతో భూమిని చదును చేయడం ప్రారంభించాడు. గురువారం వరి నాటాల్సి ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఈవిధంగా భూమిని చదును చేస్తున్నట్లు రత్నారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment