ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం | thieves pulled the chain and robbed in prashanti express | Sakshi
Sakshi News home page

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

Published Tue, Apr 5 2016 8:22 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం - Sakshi

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

గిద్దలూరు: ఏపీలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (భువనేశ్వర్- బెంగళూరు బౌండ్) రైలులో బీభత్సం సృష్టించిన దొంగలు.. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని, చైన్ లాగి రైలు ఆపి దర్జాగా పారిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీలసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే దొంగలు అడవుల్లోకి పారిపోయారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచూ రైలు దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ రైల్వే అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement