ఓటుకు కోట్లు కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుఉ ప్రజా సమస్యలను గాలికి వదిలిలేశారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.
ఒంగోలు: ఓటుకు కోట్లు కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుఉ ప్రజా సమస్యలను గాలికి వదిలిలేశారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన ప్రకాశం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ కుయుక్తులకు తెరలేపిందని, అక్రమాలకు పాల్పడాలని చూస్తొందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలపు ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.