
ప్రకాశం,సాక్షి: వెలిగొండ ప్రాజెక్టుపై తెలుగు దేశం ప్రభుత్వం దిగజారి మాట్లాడుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వై.వి సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘అసలు వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు ఎన్ని నిధులు కేటాయించిందనే విషయం, పనులు ఎవరు పూర్తి చేశారనే విషయం ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానం ఉందనే విషయాన్ని తాము చెబుతునే ఉన్నాము. అయితే కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.