బాబూ.. మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా?: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి | YSRCP MP YV Subba Reddy Serious Comments On TDP Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబూ.. మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా?: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

Published Fri, Sep 6 2024 2:41 PM | Last Updated on Fri, Sep 6 2024 6:17 PM

YSRCP MP YV Subba Reddy Serious On TDP Govt

సాక్షి, ఒంగోలు: ఏపీలో ఏం జరిగినా వైఎస్సార్‌సీపీకే అంటగడుతున్నారని మండిపడ్డారు పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసాన్ని కాపాడేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను వరద నీటిలో ముంచేశారని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏం జరిగినా ఇతరులపై అభాండాలు వేయడం టీడీపీకి అలవాటే. రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కాపాడేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను వరద నీటిలో ముంచేశారు. విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని కామెంట్స్‌ చేశారు.

కాగా, కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కాపాడేందుకు శనివారం అర్ధరాత్రి బుడమేరు గేట్లు తెరిచిన విషయం తెలిసిందే. దీంతో, వరద నీరు విజయవాడలోకి రావడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, వరదల కారణంగా 32 మంది చనిపోయారు.

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement