
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. పట్టపగలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒంగోలులోని గాంధీ పార్కు ఎదుట ఈ ఘటన జరిగింది. వివరాలు.. వస్త్ర దుకాణంలో పనిచేసే థామస్.. సహచర ఉద్యోగి భార్యను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధిత మహిళ భర్తకు ఈ విషయం గురించి చెప్పింది. కోపోద్రిక్తుడైన అతడు, థామస్‌తో మాట్లాడేందుకు గాంధీ పార్కుకు రావాలని పిలిచాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. బాధితురాలి భర్త తన వెంట తెచ్చుకున్న కత్తితో థామస్‌ను పొడవగా.. అక్కడిక్కడే అతడు మృతి చెందాడు. దీంతో కంగారు పడిన భార్యాభర్తలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.(చదవండి: నటి ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment