
సాక్షి, ప్రకాశం : అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులకు చెందిన బల్లికురవ మండలంలోని క్వారీలలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరిపారు. శనివారం ఉదయం కొనిదెన రెవెన్యూ పరిధిలోని ఈర్లకొండ వద్ద ఉన్న మూడు క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కిషోర్, గంగాభవాని, అంకమ్మ చౌదరిలకు చెందిన క్వారీలలో రికార్డులు, పద్దులను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో ఆ శాఖ డీఐజీ వెంకటరెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment