vijilance
-
ఎమ్మెల్యే అనుచరుల క్వారీలపై విజిలెన్స్ దాడులు
సాక్షి, ప్రకాశం : అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులకు చెందిన బల్లికురవ మండలంలోని క్వారీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపారు. శనివారం ఉదయం కొనిదెన రెవెన్యూ పరిధిలోని ఈర్లకొండ వద్ద ఉన్న మూడు క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కిషోర్, గంగాభవాని, అంకమ్మ చౌదరిలకు చెందిన క్వారీలలో రికార్డులు, పద్దులను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో ఆ శాఖ డీఐజీ వెంకటరెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. -
‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’
సాక్షి, విజయవాడ : డబ్బులు తీసుకోవడం మాత్రమే అవినీతి కాదని, ఇవ్వడం కూడా అవినీతేనని ఏసీబీ డీజీ విశ్వజిత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కానూరు సిద్దార్ధ కాలేజీలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వజిత్ మాట్లాడుతూ.. ‘మానసిక ఆలోచనలు, చేసే పనిలో నిబద్ధత, నీతి లేకపోవడం కూడా అవినీతే. ఈ రోజుల్లో చాలా మంది తమ పనులు తొందరగా పూర్తవ్వాలని లంచాలు ఇస్తున్నారు. మరోవైపు సమాజంలో స్వప్రయోజనాలు పెరిగిపోయాయి. దీని వల్ల వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. క్యాన్సర్ లాంటి అవినీతిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. దీనిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. ప్రజలు లంచాలు ఇవ్వడం ఎప్పడైతే మానుకుంటారో అప్పుడు అవినీతి అంతమవుతుంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేద’ని పేర్కొన్నారు. విశాఖ ఘటనపై మాట్లాడుతూ.. మధురవాడలో ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మోహన్రావు విచారణ చేస్తున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్య తీసుకుంటాం. మంత్రి చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడనంటూ ముగించారు. -
440 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
చిల్లకూరు : పేదలకు అందజేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యంను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాలతో డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి, తన సిబ్బందితో శనివారం జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపు బియ్యం రవాణా చేస్తున్న లారీని నాయుడుపేట–ఓజిలి మధ్యలో గుర్తించి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ లారీని చిల్లకూరు పోలీస్స్టేçÙన్కు అప్పగించారు. బియ్యంను గోదాముల డీటీలకు అప్పగించారు. 440 బస్తాల విలువ సుమారు రూ.5.80 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలి పారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలుమార్లు తడ ప్రాంతం నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్నామన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, ప్రజలు కూడా దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఏఓ ధనుంజయరెడ్డి, డీసీటీఓ విష్ణురావు, సిబ్బంది ఉన్నారు. -
అక్రమ నిల్వలపై విజిలెన్స్ పంజా
అక్రమ మైనింగ్ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారూ రూ. 2 కోట్ల విలువైన బ్లాక్లను సీజ్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గైడుగల్ గ్రామంలో అక్రమంగా మైనింగ్ నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మూడు లారీలతో పాటు, 200 బ్లాక్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటి విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.