440 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
440 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
Published Sun, Jul 31 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
చిల్లకూరు : పేదలకు అందజేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యంను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాలతో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, తన సిబ్బందితో శనివారం జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపు బియ్యం రవాణా చేస్తున్న లారీని నాయుడుపేట–ఓజిలి మధ్యలో గుర్తించి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ లారీని చిల్లకూరు పోలీస్‌స్టేçÙన్‌కు అప్పగించారు. బియ్యంను గోదాముల డీటీలకు అప్పగించారు. 440 బస్తాల విలువ సుమారు రూ.5.80 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలి పారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలుమార్లు తడ ప్రాంతం నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్నామన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, ప్రజలు కూడా దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఏఓ ధనుంజయరెడ్డి, డీసీటీఓ విష్ణురావు, సిబ్బంది ఉన్నారు.
Advertisement