అక్రమ మైనింగ్ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
అక్రమ మైనింగ్ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారూ రూ. 2 కోట్ల విలువైన బ్లాక్‌లను సీజ్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గైడుగల్ గ్రామంలో అక్రమంగా మైనింగ్ నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మూడు లారీలతో పాటు, 200 బ్లాక్‌లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటి విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.