ఎట్టకేలకు జిల్లా ఓటర్ల జాబితా తయారైంది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సవరణ ప్రక్రియను మొదలుపెట్టారు. అవగాహన సదస్సులు, ఓటర్ల నమోదు కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన తర్వాత దాదాపు నాలుగు శాతం మంది కొత్త ఓటర్లు తాజా జాబితాలో చోటు సంపాదించారు.
జిల్లా ఓటర్ల తుది జాబితా ఖరారైంది. గత ఏడాది నవంబర్‌లో మొదలు పెట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 16,86,020కి చేరింది. ఈ సారి నాలుగు శాతం ఓటర్లు పెరిగారు. అయితే యువ ఓటర్లు మాత్రం ఒక శాతమే పెరిగారు.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:
ఎట్టకేలకు జిల్లా ఓటర్ల జాబితా తయారైంది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సవరణ ప్రక్రియను మొదలుపెట్టారు. అవగాహన సదస్సులు, ఓటర్ల నమోదు కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన తర్వాత దాదాపు నాలుగు శాతం మంది కొత్త ఓటర్లు తాజా జాబితాలో చోటు సంపాదించారు. ఈ సారి కూడా జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి కావడం విశేషం. తాజా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 16,86,020కి చేరింది. ఇందులో పురుషులు 8,31,743 మంది, మహిళలు 8,54,170 మంది ఉండగా ఇతరులు 107 మంది ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా 67,308 ఓట్లు అదనంగా పెరి గాయి. ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముం దు జిల్లాలో 16,18,712 మంది ఉండే వారు. ఇందులో పురుషులు 7,99,382 మంది కాగా, మహిళలు 8,19,225మంది, ఇతరులు 105 మంది ఉన్నారు. కానీ చేర్పులు, తొలగింపుల తర్వాత 67,308 ఓట్లు అదనంగా పెరిగాయి. ఇక కొత్తగా సుమారు 89వేల ఓట్లు చేరగా, సుమారు 22 వేల ఓట్లను తొలగించారు. మొత్తంగా నాలుగు శాతం ఓట్లు పెరిగినట్లు అంచనా. అయితే కొత్తగా చేరిన యువ ఓట్లు 1శాతం లోపే ఉండడం కాసింత నిరాశకు గురి చేస్తోంది.