ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనుంది. ఇందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయనుంది. ఈ బాటలో మరో పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోనుంది.
రూ. 20,000 కోట్లు
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టనుంది. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీకి తెరతీయనుంది. ఈ ఆరి్థక సంవత్సరం(2024–25)లోగా బాండ్ల విక్రయాన్ని నిర్వహించేందుకు ఎస్‌బీఐ బోర్డు తాజాగా అనుమతించింది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రయివేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 20,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు ఆమోదించింది.
వెరసి దీర్ఘకాలిక బాండ్ల జారీకి జులై మొదటి వారంలో బిడ్స్‌ను ఆహా్వనించవచ్చని మర్చంట్ బ్యాంకర్లు తెలియజేశారు. ఇప్పటికే ఎస్‌బీఐ మార్కెట్ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 10–15 ఏళ్ల కాలావధితో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ యోచనలో ఉంది. జనవరిలో పెర్‌పెట్యువల్ బాండ్ల జారీ ద్వారా రూ. 5,000 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూపన్ రేటు 8.34 శాతంకాగా.. ఇంతక్రితం 15ఏళ్ల కాలపరిమితితో గతేడాది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టి రూ. 20,000 కోట్లు సమీకరించింది. ఎస్‌బీఐలో కేంద్ర ప్రభుత్వం 57.49 శాతం వాటాను కలిగి ఉంది.
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా..
మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు)ను జారీ చేయనున్నట్లు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా ఎన్‌సీడీల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. నిధులను బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఈ మారి్టగేజ్ సంస్థ అందుబాటు ధరల గృహ విభాగంపై దృష్టిపెట్టడం ద్వారా ఈ ఏడాది లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది(2023–24)లో లోన్‌బుక్ రూ. 63,000 కోట్లకు చేరింది.
బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1 శాతం బలహీనపడి రూ. 836 వద్ద నిలవగా.. పీఎన్‌బీ హౌసింగ్ షేరు 1 శాతం నీరసించి రూ. 784 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment