ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి ఉన్న రుణభారాన్ని వదిలించుకునేందుకు ఓవర్సీస్ బాండ్లను జారీ చేసేందుకు రిలయన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
రూ. 500 కోట్ల డాలర్ల బాండ్స్..!
రిలయన్స్ డిసెంబర్ 31 న జరిగిన సమావేశంలో ఓవర్సీస్ బాండ్లపై కంపెనీ నిర్ణయం తీసుకుంది. సుమారు 500 కోట్ల డాలర్ల విలువ గల బాండ్లను జారీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ చట్టాలకు లోబడి యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్‌డ్ రేట్ గల సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. కాగా బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రిలయన్స్ బయటకు తెలుపలేదు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా దాని ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగించాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment