ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబం ధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు బుధవారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుతో సహా మరో 8 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధా భరద్వాజ్ డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులేనని ఉత్తర్వులో స్పష్టం చేసింది.బెయిల్ కండీషన్‌తోపాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. కేసు నమదైన 90 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా దర్యాప్తు సంస్థ 90 రోజులకు మించి నిందితుడిని తమ అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉంటుంది. సుధా భరద్వాజ్‌ను 2018 ఆగస్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని, గృహ నిర్బంధంలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment