న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీడీఈఎల్) రూ. 440 కోట్ల మొత్తాన్ని డీఫాల్ట్ అయ్యింది. రూ. 220 కోట్ల రుణానికి సంబంధించి రూ. 190 కోట్ల అసలు, సుమారు రూ. 6 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు
అలాగే, ఎన్‌సీడీలు మొదలైన బాకీల విషయంలో దాదాపు రూ. 245 కోట్లు డీఫాల్ట్ అయినట్లు వివరించింది. 2019లో వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణానంతరం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిన సీడీఈఎల్ ఆ తర్వాత నుంచి అసెట్ల విక్రయం తదితర మార్గాల్లో రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా)
Comments
Please login to add a commentAdd a comment