న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ. 470.18 కోట్ల రుణాలు, వడ్డీల చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీడీఈఎల్) వెల్లడించింది. నగదు కొరత సంక్షోభం వల్లే రుణాలపై వడ్డీల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలిపింది.
ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న క్యాష్ క్రెడిట్‌కు సంబంధించి రూ. 216 కోట్లు, వాటిపై రూ. 5.78 కోట్ల వడ్డీ, అలాగే రూ. 200 కోట్ల ఎన్‌సీడీలు, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల చెల్లింపులు, వాటిపై రూ. 48.41 కోట్ల వడ్డీ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సీడీఈఎల్‌కు మొత్తం రూ. 495.18 కోట్ల రుణాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment