పీఎస్యూల మెడకు ఎన్పీఏలు! | NPA provisions dent bottom line of three public sector banks | Sakshi
Sakshi News home page

పీఎస్యూల మెడకు ఎన్పీఏలు!

Published Thu, Dec 1 2016 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

పీఎస్యూల మెడకు ఎన్పీఏలు! - Sakshi

పీఎస్యూల మెడకు ఎన్పీఏలు!

డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తుల టేకోవర్‌కు కేంద్రం ఒత్తిడి
మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతుండటమే కారణం
వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలు... 

 ముంబై: కొండలాపేరుకుపోతున్న మొండిబకారుుల(ఎన్‌పీఏ) సమస్య ఒకపక్క బ్యాంకులను బెంబేలెత్తిస్తుంటే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)కు కొత్త సమస్య వచ్చిపడింది. బ్యాంకులకు కోట్ల రూపారుుల్లో అప్పులు ఎగ్గొట్టి.. డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తులను టేకోవర్ చేసుకోవాలంటూ పీఎస్‌యూలపై మోదీ సర్కారు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. తద్వారా బ్యాంకుల మొండిబాకారుులను బ్యాలెన్‌‌సషీట్ల నుంచి తొలగించాలన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రధానంగా పీఎస్‌యూ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ కంపెనీలపై కేంద్రం దృష్టిపెట్టింది. అరుుతే, ఇందుకు ఆయా కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గడువు ముంచుకొస్తోంది...
ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కోసం బ్యాంకులు తమ మొండిబకారుులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిగా ప్రకటించి.. వాటికి తగిన కేటారుుంపులు(ప్రొవిజనింగ్) చేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మొండిబకారుులను వదిలించుకోవడానికి డిఫాల్ట్ అరుున కంపెనీలను వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ(ఎస్‌డీఆర్) పేరుతో టేకోవర్ చేసుకునే అధికారాలను కూడా ఆర్‌బీఐ బ్యాంకులకు కట్టబెట్టింది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని బ్యాంకులు చర్యలు కూడా తీసుకొని.. కొన్ని డిఫాల్ట్ కంపెనీల్లో మెజారిటీ వాటాలను దక్కించుకున్నారుు కూడా.

అరుుతే, దేశంలో అత్యధికంగా మొండిబకారుులు పేరుకుపోరుున స్టీల్, విద్యుత్, షిప్పింగ్ వంటి రంగాలకు చెందిన అనేక కంపెనీలకు సంబంధించి మొండిబకారుులను బ్యాలెన్‌‌సషీట్ల నుంచి తొలగించడం బ్యాంకులకు కత్తిమీదసామే. దీంతో కేంద్రం పీఎస్‌యూల నుంచి ఆయా ఆస్తులను కొనిపించి.. బ్యాంకులకు ఆ మేరకు రుణ బకారుుల నుంచి విముక్తి కలిగించే ప్రణాళికను రూపొందించింది. ఒక్క విద్యుత్ రంగంలోనే ఎన్‌పీఏలు రూ.4 లక్షల కోట్లకు ఎగబాకినట్లు అంచనా. ఇక స్టీల్ రంగానికి చెందిన కంపెనీల మొండిబకారుులు కూడా సుమారు రూ.3.5 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది.

 23 కంపెనీల జాబితా...
తీవ్రమైన మొండిబకారుుల సమస్య ఎదుర్కొంటున్న ఈ మూడు రంగాలను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా గత నెలలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అగ్రగామి బ్యాంక్ చీఫ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎస్‌బీఐ అధిపతి అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ.. స్టీల్, విద్యుత్, షిష్పింగ్ రంగాలకు చెందిన 23 కంపెనీల జాబితాను బ్యాంకులకు అందించినట్లు ఆయా వర్గాలు వెల్లడించారుు.

ఈ కంపెనీల మొత్తం మొండిబకారుుల విలువ రూ. లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్యాంకులకు ఈ గుదిబండను తగ్గించేందుకు పీఎస్‌యూలు ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేయాలని సూచించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించారుు. ఈ జాబితాలో భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్టోస్ట్రీల్ వంటివి ఉన్నారుు. జైట్లీతో భేటీకి సెరుుల్, ఎన్‌టీపీసీ, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లకు చెందిన సీఎండీలు కూడా హాజరయ్యారు.

 సెయిల్ నో...!
మొండిబకారుుల సమస్యలో కూరుకుపోరుు.. నష్టాల్లో ఉన్న కంపెనీలకు చెందిన ఆస్తులను బ్యాంకర్లతో ఒప్పందం ద్వారా కొనుగోలు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెరుుల్ ప్రాథమికంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అరుుతే, బ్యాంకర్లు మొండిబకారుుల విషయంలో కొంత వెసులువాటును కల్పిస్తే... సెరుుల్ ఈ ప్రతిపాదనలను పరిశీలించే అవకాశం ఉందని జైట్లీ సమావేశం తర్వాత ప్రధాని కార్యాలయానికి ఉక్కు శాఖ తెలియజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారుు.

ఈ వ్యవహారంపై సెరుుల్ ఉన్నతాధికారులెవరూ ఇంకా నోరు విప్పడం లేదు. ఎన్‌పీఏలను విక్రరుుంచేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొనేవారు లేకపోవడంతో బ్యాంకులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ప్రత్యామ్నాయంగా పీఎస్‌యూలతోనే డిఫాల్ట్ కంపెనీల వాటాలను కొనిపించేలా ప్రభుత్వం బ్యాంకులకు దారిచూపిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నారుు. ఇలా అరుుతే, బ్యాంకులు తమ బకారుుల్లో 30-40 శాతం మేర వదులుకున్నా, ఎవరూ దీనిపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా ఉంటుందనేది ఈ చర్యల ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement