Contribution
-
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
ఈపీఎఫ్‌వో పెనాల్టీ తగ్గింపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది. -
ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'
ఆమె చదువుకోలేదు. కానీ నేల గొప్పతనం తెలుసు. విత్తనం విలువ తెలుసు. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చెయ్యాలో తెలుసు. ఆమె మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా.... 30 రకాల చిరుధాన్యాల పంటలు పండించి 'విత్తన సంరక్షణ' నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ....నడిమిదొడ్డి అంజమ్మ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తనాల విప్లవంలో ఆమె చేసిన కృషిపై సాక్షి ప్రత్యేక కథనం. అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గంగ్వార్, అది తెలంగాణ , కర్ణాటకలోని ఒక సరిహద్దు ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె బడి ముఖమైనా చూడలేదు. పదేళ్ళ వయసులోనే.. సమీపంలోని గంగ్వార్ కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. ''అప్పట్లో మాకు రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీగా. జీవితాన్ని మొదలుపెట్టాను" అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటు, క్రమ క్రమంగా ఒక అర ఎకరం భూమిని ఆ దంపతులు సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. అదే సమయంలో... ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాలు సాగు చేసింది. అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి.. కొత్త మెళకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలను ఇచ్చింది. ముప్పై ఏళ్ళ కాలంలో అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి యజమానురాలుగా చేరుకున్నారు. వాయిస్ ఓవర్ : నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు. తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు. ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించరు. అవసరమయ్యే రైతులకు ఉచితంగా ఇస్తారు, వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్ళీ భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డు తో సత్కరించింది. ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తన సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటిం చారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువులు తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకున్నారు. అంజమ్మ విత్తన సంరక్షకురాలు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది. ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జాయిరాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. డీడీఎస్ డైరెక్టర్‌గా ఈ మధ్య వరకూ పనిచేసిన.. దివంగతులైన సతీష్ గారి సలహాలు, సూచనలు నన్ను ముందుకు నడిపించాయి. చిరుదాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పశువులకు, పక్షులకూ కూడా ఇవి మేలు చేస్తాయి అని చెబుతోంది 63 ఏళ్ళ అంజమ్మ . ఇక అంజమ్మ అటు విత్తన సంరక్షణ చేస్తూనే .. రాజకీయాల్లో కూడా రాణిస్తోంది . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది, ప్రస్తుతం న్యాలకల్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!) -
చేపల ఉత్పత్తిలో గణనీయ పురోగతి సాధించిన ఏపీ
-
ఈపీఎఫ్‌వో అలర్ట్: ఉద్యోగులకు తీపి కబురు!
సాక్షి, ముంబై: పీఫ్ చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి (సీలింగ్) ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు సమాచారం. చందాదారుల గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము అందనుంది. కనీస వేతనం పెంపు? ఈ అంశంపై త్వరలో ఒక కమిటీని వేయనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతన పరిమితి 21 వేలు కావచ్చు. దీని ప్రకారం ఉద్యోగుల వేతన పరిమితి 6వేల రూపాయల మేర పెరుగుతుంది. అలాగే ఉద్యోగి పీఎఫ్‌లో కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ మొత్తం కూడా పెరగనుంది. (చదవండి: షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!) ప్రస్తుతం రూ.15 వేలు జీతం ఉన్న ఖాతాదారుడికి ఖాతాలో రూ.1800 పీఎఫ్ కట్ అయితే, జీతం 21 వేలు అయితే, పీఎఫ్ మొత్తం రూ. 2530కు చేరుతుంది. ఫలితంగా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఉద్యోగి, యజమాని చెల్లించే వాటాలకు కూడా వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఫండ్‌తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది. (Bisleri1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) కాగా ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పథకంలో కొత్తగా 16.82 లక్షల మంది చేరారు. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని అంచనా. -
'ఇంగ్లండ్‌తో సిరీస్.. వారిద్దరి ఆట మరువలేనిది'
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఓపెనర్లిద్దరి ఆటతీరు అద్భుతమని పేర్కొన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ మాట్లాడాడు.'' రోహిత్, కేఎల్ రాహుల్ భాగస్వామ్యాలు మరువలేనివి. లార్డ్స్ టెస్టులో సెంచరీ భాగస్వామ్యంతో పాటు నాటింగహమ్, ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ఫిప్టీ ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేయడం జట్టుకు కలిసి వచ్చింది. 30 నుంచి 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ద్వయం టీమిండియాను పటిష్టస్థితిలో నిలిచేలా చేసింది. అయితే కొన్నిసార్లు ఈ ఇద్దరు విఫలం కావడం.. మిడిలార్డర్ వైఫల్యంతో తక్కువ స్కోర్లకే ఆలౌట్ కావాల్సి వచ్చింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అదే జరిగింది. చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ రోహిత్ , రాహులిద్దరు చెరో సెంచరీతో మెరవడం.. వాళ్లు సెంచరీ చేసిన మ్యాచ్‌లు టీమిండియా గెలవడం మరో విశేషం. సూపర్ థ్రిల్లర్‌గా జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మూడు టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలతో అలరించాడు. ఇక 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇంగ్లండ్‌పై ఆధిక్యంలో ఉన్నట్లే. ప్రస్తుతానికి కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది ఇరు బోర్డులు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయి. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలవనున్నాయి. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇదే సమయంలో రద్దయిన టెస్టు మ్యాచ్ నిర్వహిస్తారని భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు -
లక్షల ఉద్యోగుల జీతం పెరగనుంది.. కానీ,
సాక్షి, న్యూఢిల్లీ : దేశ జీడీపీ పాతాళానికి పడిపోతున్న నేపథ్యంలోనరేంద్రమోదీ సర్కార్ కొత్త చర్యను చేపట్టబోతోంది. ముఖ్యంగా వినియోగ డిమాండ్ భారీగా క్షీణిస్తున్న తరుణంలో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం శాతాన్ని పెంచాలని యోచిస్తోంది. ఈ కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు పెరగనున్నాయి. అంటే ఉద్యోగి జీతంనుంచి కట్ అయ్యే పీఎఫ్ వాటాలో కోత పడనుంది. ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే సామాజిక భద్రత కోడ్ బిల్లు 2019 లో మారనున్న నిబంధనల ప్రకారం, పీఎఫ్‌లో ఉద్యోగి వాటా ప్రస్తుత 12 శాతానికి కంటే తక్కువగా ఉండనుంది. అయితే యజమాని భాగంలో మాత్రం ఎలాంటి మార్పు చేయడంలేదు. ఎంపిక చేసిన రంగాల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కటింగ్స్లో చట్టబద్ధమైన తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని చూస్తోంది. తద్వారా వ్యవస్థీకృత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగుల టేక్ హోమ్ జీతం స్వల్పంగా పెరగనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం, సంస్థ నుంచి 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. కొత్తగా రానున్న నిబంధనల ప్రకారం ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లోకి జమ అయ్యే మొత్తాన్ని తగ్గించనుంది. ఇదే కాకుండా ఈఫీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. కనీస వేతన నిబంధనలతో పాటు ఉద్యోగి పెన్షన్ విధానంలో కూడా మార్పులు చేయనుంది. గత ఐదేళ్లుగా ఈ ప్రతిపాదనులు ఉన్నాయి. ఈక్రమంలోనే ఈపీఎఫ్ సవరణ బిల్లు 2019 డ్రాఫ్ట్‌ను కేంద్ర కార్మిక శాఖ రూపొందించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీర్ఘకాలంలో ఈ చర్య దుష్ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కార్మికుల పదవీ విరమణ తరువాత అందుకునే నగదు భారీగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. -
4 కోట్ల ఈఎస్ఐ లబ్దిదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇఎస్ఐసీ) ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లిస్తున్న మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. సంయుక్తంగా దీన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెల (జూలై) ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈఎస్ఐపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద 6.5 శాతం నుండి 4 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6 శాతం చెల్లింపు వాటాలో ఎంప్లాయర్ (యజమాని) 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లించేవారు. తాజా ఆదేశాల ప్రకారం జూలై 1వ తేదీ నుంచి యాజమాన్యం వాటా 4.75 నుంచి 3.25 శాతానికి, ఉద్యోగి వాటా శాతం 1.75 నుంచి 0.75 శాతానికి తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల 3.6 కోట్ల మంది ఉద్యోగులకు, 12.85 లక్షల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల సంబంధిత ఇండస్ట్రీకి ఏడాదికి రూ.5,000 కోట్లు ఆదా కానున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరింత మంది ఈఎస్ఐలో చేరే అవకాశం ఉందని, దీనివల్ల వారు కూడా సంఘటిత రంగ కార్మికులుగా మారతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా యాజమాన్యాలపై భారం తగ్గించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈఎస్ఐకి చందాల రూపంలో రూ.22,279 కోట్లు సమకూరాయి. కాగా జనవరి 1, 2017 నుంచి అప్పటివరకూ రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 21 వేలకు పెంచింది. దీంతో ప్రస్తుతం నెలకు రూ.21,000 వరకు వచ్చేవారు ఈఎస్ఐ బెనిఫిట్స్‌కు అర్హులు. నెలకు రూ. 21వేల లోపు జీతం ఉన్నవారు ఈఎస్ఐలో చేరితే వారికి అనారోగ్య సమయంలో వైద్యసేవలతో పాటు, సందర్భాన్నిబట్టి నగదు సాయం కూడా లభిస్తుంది. -
కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలి
హన్మకొండ : ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాÄæూస్ అసోషియేషన్ జిల్లా శాఖ డి మాండ్ చేసింది. సోమవారం హన్మకొండలో జరిగిన జిల్లా శాఖ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.లింగమూర్తి వెల్లడించారు. ఈ నెల 10న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి. 11న అన్ని మండలాల్లో తహసీల్దార్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలి. 16న ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత, 22న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పా ర్కు వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్.కుమారస్వామి, మనోహర్, శ్రీనివాస్‌రావు, బుచ్చన్న, వి.రాంబాబు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ మీడియం అభివృద్ధికి కృషి
డోర్నకల్ : ఇంగ్లిష్ మీడియం అభివృద్ధికి కృషి చేస్తున్నామని డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవ.డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తెలిపారు. ఇంగ్లాండ్ దేశంలోని గ్లౌస్టర్ డయోసీస్‌కు చెందిన ప్రతినిధుల బృందం స్థానిక డీడీ ఈఎం పాఠశాలలో శనివారం పర్యటించింది. ఈ బృం దం పాఠశాలకు తొమ్మిది మైక్రోస్కోప్‌లు, ఒక బైనాక్యులర్ మైక్రోస్కోప్‌ను బహూకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్లౌస్టర్ డయోసీస్ ద్వారా ఇక్కడి పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. మొక్కలు నాటిన విదేశీయులు డీడీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన హరితహారంలో భాగం గా తొమ్మిది మంది విదేశీయుల బృందంతో బిషప్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు వారిచే మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో గ్లౌస్టర్ డయోసీస్ యంగ్ టీం లీడర్లు రెవ.గేరీ గ్రేడీ, మాగీ గ్రేడీ, జెస్ టర్నర్, టీం సభ్యులు రాబ్ గ్రేడీ, ఎరిన్ గ్రేడీ, విల్ జాగో, ఎలియా యాస్లీ, అలైస్ స్ప్రింగెట్, టాం మర్ఫీ, డయోసీస్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ విజయభూషణ్, హెచ్ఎం ఆర్ అనురాధ, సంగీత, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి భారత్ పెద్ద మనుసు
న్యూఢిల్లీ: భారత్ మరోసారి తన పెద్ద మనసును చాటుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి విరాళాన్ని ప్రకటించింది. 2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ (సీఈఆర్ఎఫ్)కు ఐదు లక్షల డాలర్లను(రూ.34కోట్లు) విరాళంగా అందించనుంది. ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి కూడా ప్రకటించింది. 'మావనత దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముందునుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది' అని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.