ఇంగ్లిష్ మీడియం అభివృద్ధికి కృషి
ఇంగ్లిష్ మీడియం అభివృద్ధికి కృషి
Published Sat, Jul 30 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
డోర్నకల్ : ఇంగ్లిష్ మీడియం అభివృద్ధికి కృషి చేస్తున్నామని డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవ.డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తెలిపారు. ఇంగ్లాండ్ దేశంలోని గ్లౌస్టర్ డయోసీస్‌కు చెందిన ప్రతినిధుల బృందం స్థానిక డీడీ ఈఎం పాఠశాలలో శనివారం పర్యటించింది. ఈ బృం దం పాఠశాలకు తొమ్మిది మైక్రోస్కోప్‌లు, ఒక బైనాక్యులర్ మైక్రోస్కోప్‌ను బహూకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్లౌస్టర్ డయోసీస్ ద్వారా ఇక్కడి పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.
మొక్కలు నాటిన విదేశీయులు
డీడీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన హరితహారంలో భాగం గా తొమ్మిది మంది విదేశీయుల బృందంతో బిషప్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు వారిచే మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో గ్లౌస్టర్ డయోసీస్ యంగ్ టీం లీడర్లు రెవ.గేరీ గ్రేడీ, మాగీ గ్రేడీ, జెస్ టర్నర్, టీం సభ్యులు రాబ్ గ్రేడీ, ఎరిన్ గ్రేడీ, విల్ జాగో, ఎలియా యాస్లీ, అలైస్ స్ప్రింగెట్, టాం మర్ఫీ, డయోసీస్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ విజయభూషణ్, హెచ్‌ఎం ఆర్ అనురాధ, సంగీత, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement