మరోసారి భారత్ పెద్ద మనుసు | India To Contribute USD 500,000 To UN Emergency Response Fund | Sakshi
Sakshi News home page

మరోసారి భారత్ పెద్ద మనుసు

Published Fri, Dec 18 2015 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

మరోసారి భారత్ పెద్ద మనుసు

మరోసారి భారత్ పెద్ద మనుసు

న్యూఢిల్లీ: భారత్ మరోసారి తన పెద్ద మనసును చాటుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి విరాళాన్ని ప్రకటించింది. 2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ (సీఈఆర్ఎఫ్‌)కు ఐదు లక్షల డాలర్లను(రూ.34కోట్లు) విరాళంగా అందించనుంది.

ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి కూడా ప్రకటించింది. 'మావనత దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముందునుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది' అని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement